18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
రివ్యూలు సినిమా

Repeat: ఓటీటీ రిపీట్ రివ్యూ.! హిట్టా.!? ఫట్టా.!?

Repeat movie review and streaming on December 1 hotstar
Share

Repeat: తమిళంలో తెరకెక్కిన డేజావు కి తెలుగు రీమేక్ గా వచ్చిన సినిమా రిపీట్.. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. సీనియర్ రైటర్ అచ్యుతు కుమార్ రాసిన నవల లో భాగంగానే ఈ సినిమా కథ సాగుతుంది. డిసెంబర్ 1న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..!

Repeat movie review and streaming on December 1 hotstar
Repeat movie review and streaming on December 1 hotstar

సీనియర్ రైటర్ సుబ్రహ్మణ్యం (అచ్యుత్ కుమార్) ఒకరోజు రాత్రి బాగా మందు తాగేసి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. తాను రైటర్ అని ప్రస్తుతం ఒక కథ రాస్తున్నానని.. కానీ ఆ కథలోని పాత్రలు బయటకు వచ్చి తనని బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నాయని చెబుతాడు. కానీ స్టేషన్లో వాళ్లందరూ వాటిని పట్టించుకోకుండా కొట్టి పారేస్తారు. అతను ఆ కథలో రాసినట్టుగానే డీజీపీ ఆశా ప్రమోద్ (మధుబాల) కూతురు పూజ (స్మృతి వెంకట్) ను కిడ్నాప్ కి గురవుతుం.ది ఈ విషయం బయటకు రాకుండా ఈ కేసును అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కుమార్ (నవీన్ చంద్ర) ను ఆశ ప్రమోద్ రంగంలోకి దింపుతారు. తన కూతురు కిడ్నాప్ కి గురవడం వెనుక ఆ రైటర్ హస్తం ఉందా.. లేదంటే ఆ రైటర్ తన కథలో రాసిన విషయాలు ఎలా నిజమవుతున్నాయి అనే విషయంపై దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తారు.. ఆ రైటర్ ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కొంటాడు.. చివరికి అతనికి తెలిసే చేదు నిజాలు ఏంటి అనేది ఈ సినిమా కథ.

నవీన్ చంద్ర, మధుబాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కాంతార సినిమా తో అచ్యుత్ కుమార్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు . ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎవరి పాత్రకు అనుగుణంగా వారు నటించారు. కంటెంట్ పరంగా బలమైన సినిమా ఇది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులను కదలనివ్వకుండా కట్టిపడేస్తుంది. కథలో ఏ పాత్ర కూడా అతిగా అనవసరంగా కనిపించలేదు లవ్ యాక్షన్ ఎమోషన్ అనేది సరైన టైమ్ కి సరిగ్గా సమతూగేలాగా సెట్ అయ్యాయి. ఈ మూడు కూడా సస్పెన్షన్ ముందు పెట్టుకుని నడుస్తూ ప్రేక్షకులను ధ్రిల్ చేశాయి. మొత్తానికి రిపీట్ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పాలి.


Share

Related posts

Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేశ్ కి నేచురల్ పర్ఫార్మర్ గా క్రేజ్..వరుసగా ఆఫర్స్

GRK

రకుల్ అలాంటి పని చేయడానికి అసలు కారణం ఇదే అంటున్నారు.. మరి రకుల్ ఏం చెబుతుందో..??

GRK

మంచం మీద ముగ్గురు మగాళ్లు .. టాప్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ ..

Varun G