NewsOrbit
న్యూస్ రివ్యూలు

Review రివ్యూ : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?

Review :  యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అయిన సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ చిత్రం పైన ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ‘నీలి నీలి ఆకాశంపాట తో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాబు ఎస్.వి నిర్మాతగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈరోజు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

Review 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?

Review 30 rojullo preminchadam elaa movie review
Review 30 rojullo preminchadam elaa movie review

కథ 

ఈ సినిమాలోని పాటలు చూస్తేనే మనకు ఇది పునర్జన్మల స్టోరీ అని అర్థం అయిపోతుంది. 1947లో అరకు ప్రాంతంలో అటవీ తెగలలో నివసించే ఒక ప్రేమజంట అనవసరమైన అపార్థాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకుంటారు. అయితే చాలా దశాబ్దాల తర్వాత ప్రస్తుత కాలంలో మళ్ళీ అర్జున్ (ప్రదీప్), అక్షర (అమృత అయ్యర్) లు పుడతారు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకే కాలేజీ లో చదువుకుంటారు, పక్కపక్కన ఇళ్ళలోనే ఉంటారు. కానీ ఒకరి మీద ఒకరికి ఎప్పుడూ పరస్పరం కోపం వస్తూనే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ తో కలిసి అరకు టూర్ కి వెళ్తారు. అక్కడ ఒక దేవత విగ్రహం ముందు వారికి అనూహ్యంగా ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. దీంతో వీరి జీవితాలు తారుమారు అయిపోతాయి. తర్వాత ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

ప్లస్ లు

  • రెండు పాటలు చాలా బాగున్నాయి. విడుదలకు ముందు వచ్చిన హైప్ కు తగ్గట్లు దర్శకుడు వాటిని ఎంతో బాగా చిత్రీకరించాడు. ‘నీలి నీలి ఆకాశం’ పాట సినిమా కే హైలైట్.
  • సినిమాలో ఇంటర్వల్ ట్విస్ట్ చాలా పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. ఇక ఇదే చిత్రానికి వెన్నెముక లాంటిది. ఇటువంటి ఇంటర్వెల్ ను ఎంతో ఆసక్తికరంగా తీయడం విఫలమైతే కథకు ఉన్న ప్రాణం పోతుంది. అయితే దర్శకుడు ఈ విషయంలో మాత్రం మంచి పనితనం కనబరిచాడు.
  • 1947 లో జరిగిన కథను ప్రస్తుత వర్తమానంతో ముడిపెట్టి ప్రేమకథలు తీయాలంటే ఎమోషన్స్ బాగా పండాలి. ఈ చిత్రంలో ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా ఎమోషన్స్ అన్నీ చాలా క్లియర్ గా, నీట్ గా ఉన్నాయి.

మైనస్ లు

  • రెండవ అర్ధ భాగం బాగా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా మొదటి అర్ధ భాగంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ రెండవ భాగంలో కరువు కావడం, ఇక మూలకథకు సంబంధించిన ఎపిసోడ్లు కొద్దిగా చిరాకు తెప్పిస్తాయి.
  • సినిమాను బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడింది. ఎన్నో అనవసరమైన సీన్లను చిత్రం నుండి తేలికగా తొలగించవచ్చు. ప్రేక్షకులకి ఈ కధ మీద ఉన్న ఉత్సాహం ఈ సాగతీత వల్ల బాగా తగ్గిపోతుంది.
  • ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే టైటిల్ కు పూర్వజన్మ ప్రేమకథను ముడిపెట్టినప్పుడు అందులో ప్రేమ పుట్టడానికి కావాల్సిన అంశాల్లో చాలా పరిపక్వత కలిగి ఉండాలి. అయితే ఈ సినిమాలోని చాలా ప్రేమ సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి. ఇదే సినిమాకి అతి పెద్ద మైనస్.
  • యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన చిత్రం లో కామెడీ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఈ చిత్రంలో మాత్రం అలాంటి కామెడీ పండలేదు. జబర్దస్త్ స్కిట్ల లో చేసే కామెడీకి…. సినిమాల లో ఉండాల్సిన కామెడీ కి ఎంతో వ్యత్యాసం ఉంది అని మరోసారి రుజువయింది. ఇక ఈ కామెడీ ఎపిసోడ్ లకి తీసుకున్న టైమింగ్ లో కథ మీద దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేది.

విశ్లేషణ : 

బుల్లి తెర పై స్టార్ యాంకర్ అయిన ప్రదీప్ తన మొదటి సినిమాలోనే వెయిట్ కి మించిన సబ్జెక్టు తీసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను తన యాక్టింగ్ విషయంలో ఇంకా హోం వర్క్ చేయాలి. అలాగని మరీ తీసిపారేసేలా అయితే చేయలేదు కానీ…. ఈ కథ మరింత నటన డిమాండ్ చేసింది. పాటలతో వచ్చిన అంచనాలు ఈ సినిమా ను దారుణంగా దెబ్బతీశాయి. ప్రేక్షకులకి అద్భుతమైన పాట ఒక్కటి ఉంటే సరిపోదు. ఒక పాట ఎంతో బాగుందని సినిమాకి వెళితే మాత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తీవ్రంగా నిరాశ పరుస్తుంది. హీరోయిన్ మంచి నటన కనబరిచినప్పటికీ…. ఎమోషన్స్ బాగానే ఉన్నప్పటికీ…. అవసరమైన సమయంలో సినిమా తో ప్రేక్షకుడికి హై ఇవ్వలేకపోయారు. ఇంటెర్వెల్ ట్విస్ట్ ఒకటి వుంటే చాలు…. దాని చుట్టూ కథ అంతా నడిచిపోతుంది అనుకున్న దర్శకుడి ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది. ఇక సాగదీసిన సన్నివేశాలతో ఈ చిత్రం సగటు కంటే తక్కువ స్థాయిలో నిలబడింది.

Review

ఎంతో ఖాళీగా ఉంటే తప్ప ఈ సినిమాను ఓటిటి లో చూడటం కూడా కష్టమే.

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N