NewsOrbit
న్యూస్ రివ్యూలు

Review A1 Express : A1 ఎక్స్ప్రెస్ మూవీ రివ్యూ

Review A1 Express : సందీప్ కిషన్ హీరోగా…. లావణ్య త్రిపాఠీ తో జతకట్టి నటించిన సినిమా ‘A1 ఎక్స్ప్రెస్ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో డెన్నిస్ జీవన్ దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు. హిప్ హాప్ తమిళ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….

 

Review A1 Express movie sundeep kishan
Review A1 Express movie sundeep kishan

Review A1 Express కథ :

ఈ సినిమాకు కథ మొత్తం యానాం నగరంలో జరుగుతుంది. ఒక హాకీ గ్రౌండ్ ను స్పోర్ట్స్ మినిస్టర్ (రావు రమేష్) వంటి వ్యక్తి అమ్మేందుకు ఎలా ప్రయత్నిస్తుంటాడు అనే పాయింట్ మీద కథ మొదలవుతుంది. అతనికి ఆటలు అంటే కేవలం వ్యాపారం వ్యాపారమే. ఇలాంటి సమయంలోనే అక్కడికి సంజు (సందీప్ కిషన్) వస్తాడు. లోకల్ హాకీ ప్లేయర్ అయినటువంటి లావ్ (లావణ్య త్రిపాటి) పైన మనసుపడ్డ సంజు…. ఆమె కోసం అక్కడికి వస్తే తర్వాత అనేక కారణాల వల్ల సంజు ఆ గ్రౌండ్ ను కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. ఇక చివరికి చూస్తే అసలు సంజు ఎవరు? అతను ఏ పనిమీద వచ్చాడు? చివరికి హాకీ గ్రౌండ్ సాధించుకున్నారా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

  • తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చేవి చాలా తక్కువ. వచ్చిన వాటిలో హిట్ అయ్యేవి కూడా అరుదు. అలాగే ‘A1 ఎక్స్ప్రెస్విషయంలో సినిమా మొత్తం హాకీ పైన నడపకుండా దర్శకుడు తెలివిగా ఎమోషన్స్ ఆధారంగా కథను తెరకెక్కించాడు. ఇదే అన్నింటికన్నా పెద్ద ప్లస్ పాయింట్.
  • సందీప్ కిషన్ నటన పరంగా ఈ చిత్రంలో మరొక మెట్టు ఎక్కాడు అనే చెప్పాలి. తన సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు.
  • ఇందులో రావు రమేష్ క్యారెక్టర్ కూడా సినిమాకు బాగా ఉపయోగపడింది. అతని డైలాగులు, అలాగే సీరియస్ పరిస్థితుల్లో కామెడీ టైమింగ్ బాగా క్లిక్ అయ్యాయి. సీనియర్ నటులను బాగా వాడుకోవడంలో కొత్త దర్శకుడు సఫలమయ్యాడు అని చెప్పాలి.
  • ఇక లావణ్య త్రిపాఠీ, సందీప్ కిషన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. సినిమాలో కామెడీ డీసెంట్ గా, క్లీన్ గా ఉంది. రొటీన్ కు భిన్నంగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి కమెడియన్లు చేసిన ఎమోషనల్ సీన్లు కూడా కథలో ఇమిడిపోయాయి.

 

మైనస్ లు :

  • మెయిన్ కథ లోకి ఎంటర్ అయ్యేందుకు సినిమా బాగా సమయం తీసుకుంటుంది. ఇక క్యారెక్టర్లు అన్నింటిని ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో పరిచయం చేసేందుకు కూడా మొదట్లో ఎక్కువ సీన్లు పెట్టాల్సి వచ్చింది.
  • హీరోకి ప్రత్యర్థి జట్టు లో ఉండే కోచ్ బాగా వీక్ గా కనిపిస్తాడు. అతనిని స్థానం లో మరొక స్ట్రాంగ్ పర్సనాలిటీ ని తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
  • అక్కడక్కడ రాబోయే సన్నివేశాలను ప్రేక్షకులు ముందుగానే ఊహించవచ్చు. స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది పెద్ద నెగటివ్ పాయింట్ కాకపోయినప్పటికీ కొత్త సినిమా చూడాలి అనుకునే ఆడియన్స్ మాత్రం మరి సినిమాను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయకపోవచ్చు.

Review A1 Express – విశ్లేషణ :

మొత్తానికి ‘A1 ఎక్స్ప్రెస్ఒక మంచి సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. కొత్త దర్శకుడు అయినప్పటికీ సినిమాను జీవన్ ప్రెజెంట్ చేసిన విధానం చాలా నీట్ గా ఉంది. ఎమోషన్స్, కామెడీ, లవ్ సమపాళ్లలో స్క్రీన్ మొత్తం నింపేశాడు. యాక్టర్స్ నుండి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టిఎక్కడెక్కడ సీరియెస్నెస్ క్రియేట్ చేయాలిఎక్కడెఎక్కడ కామెడీ పెట్టాలి అన్న విషయంలో బాగా పరిణితి ప్రదర్శించాడు. ఇక సినిమాలో ఉన్న ఒకే ఒక్క మైనస్ మొదట్లో వచ్చే అనవసరమైన సన్నివేశాలు. కథలోకి ఎంటర్ అయ్యేందుకు దర్శకుడు తీసుకున్న సమయం. దానిని తప్పించి సినిమాలో పెద్దగా తప్పుపట్టాల్సిన అంశాలు కూడా ఏవీ లేవు. మొత్తానికి ‘A1 ఎక్స్ప్రెస్ను ఈ వీకెండ్ హాయిగా ఫ్యామిలీతో పాటు వెళ్లి చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేయవచ్చు.

చివరి మాట : A1 సినిమా…!

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N