బాలీవుడ్ ప్రముఖ సెలబ్రెటీలు అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ కలిసి నటించిన చిత్రం AK vs AK. విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత వినూత్న కథాంశంతో తెరకెక్కింది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…
కథ
ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనురాగ్ కశ్యప్ అనిల్ కపూర్ తమ నిజ జీవిత క్యారెక్టర్లే ప్రదర్శించారు. ఇక అనిల్ కపూర్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అనురాగ్ తన సొంత టాలెంట్ పై పైకి వచ్చాడు. వీరిద్దరికి ఇంటర్వ్యూ లో ఒక గొడవ జరుగుతుంది. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ సోనమ్ కపూర్ ను కిడ్నాప్ చేసి ఒక చోట దాచి పెట్టి అనిల్ కపూర్ తో ఆమెను వెతుక్కోమని చెబుతాడు. ఇక సెలబ్రిటీ అనిల్ కపూర్ ముంబై రోడ్ల మీద పడి తన కూతురిని వెతకడం ప్రారంభిస్తాడు. అతను పోలీసులను కలవడానికి లేదు బయట ఎవరి సహకారం తీసుకోకూడదు. ఇక అర్ధరాత్రి ముంబై రోడ్డు మీదకి వెళ్ళిన నటుడు అనిల్ కపూర్ ను గుర్తుపట్టి జనాలంతా అతని మిషన్ కు అడ్డుతగులుతూ ఉంటారు. ఇవన్నీ దాటి అతను తన కూతురిని కాపాడుకుంటాడా… అసలు దర్శకుడు అనురాగ్ ప్లాన్ ఏమిటి అన్నది కథ.
ప్లస్ లు
అనిల్ కపూర్, అనురాగ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
చాలా కొత్త కథ
కొత్త అనుభూతిని కలిగించే సన్నివేశాలు
మైనస్ లు
సహజమైన కథలో ఉండే కృత్రిమ అంశాలు
సినిమా నిడివి
స్క్రీన్ ప్లే
విశ్లేషణ :
ముందుగా అసలు ఇటువంటి ఒక కథను సినిమా లాగా తెరకెక్కించిన దర్శకుడి ధైర్యానికి మెచ్చుకోవాలి. అలాగే నిర్మాతలకు కూడా ఎంతో ధైర్యం ఉండాలి. అనురాగ్ కశ్యప్, అనిల్ కపూర్ తమ ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ సినిమాను సక్సెస్ఫుల్ చేశారు. ఎంతో సహజంగా ఉన్న వారు ప్రదర్శన నిజంగానే అదిరిపోయింది అని చెప్పాలి. ఇక ఉత్కంఠభరితమైన సన్నివేశాలు వినోదం సస్పెన్స్ కలిసి ఉండే ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కొద్దిగా ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా ఒక స్టార్ రోడ్డుపైన వెళ్లడం వంటి సహజమైన కథలో కొన్ని విషయాల్లో కమర్షియల్ హంగులు కనిపించాయి. అది చిన్న మైనస్ అని చెప్పాలి. అలాగే సినిమా నిడివి, కథాంశంలో మరికొంత లోతు ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా చూస్తున్నంత సేపు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!