రివ్యూలు సినిమా

రివ్యూ : అల్లుడు అదుర్స్

Share

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లుడు అదుర్స్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సంక్రాంతి బరిలో నిలిచింది. ఒక యాక్షన్ హారర్ కామెడీ యాంగిల్ లో ప్రమోషన్ జరుపుకున్న ఈ చిత్రాన్ని గొర్రెల సుబ్రహ్మణ్యం ప్రొడ్యూస్ చేశారు. డీ.ఎస్.పి సంగీత సారధ్యం వహించినగా చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

 

కథ :

శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) న్హు చిన్నతనంలో వసుంధర అనే అమ్మాయి వదిలి వెళ్లిపోయిన తర్వాత ఇక జీవితంలో ప్రేమలో పడకూడదు అని తీర్మానించుకుంటాడు. అలాగే సింగిల్ గా ఉంటూ తన మిగిలిన జీవితం మొత్తం ఫ్రెండ్స్ తో జాలిగా గడుపుతూ బ్రతికిస్తాడు. ఇక ఒకరోజు తన స్నేహితులతో ఒకడిని జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్), అతని రౌడీలు అటాక్ చేస్తున్నారని తెలిసి అతను కాపాడేందుకు వెళ్తాడు. అక్కడే ప్రకాష్ రాజు కూతురు క్ॐఉది (నభానటాష్) ను మొదటి చూపులోనే ప్రేమించి ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. ఈ లోపలే గజ (సోనూసూద్) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి శీను ను చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు వసుంధరకి ఈ క్యారెక్టర్స్ తో సంబంధం ఏమిటి…? శ్రీను జై పాల్ రెడ్డిని ఇంప్రెస్ చేసి శ్రీను కౌముది ని ఎలా దక్కించుకుంటాడు… గజ ను ఎలా ఎదుర్కొంటాడు అన్న విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ లు

సోనూ సూద్ పర్ఫార్మెన్స్
ప్రొడక్షన్ వ్యాల్యూస్
రెండు పాటలు, శ్రీనివాస్ డాన్స్

మైనస్ లు

పాత కాలం కథ
విపరీతంగా బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే
నవ్వు రాని కామెడీ
సంబంధం లేని సీన్లు
అసలు కనెక్షన్ లేని కథ

రివ్యూ :

ఈ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఏమున్నాయో చెప్పాలంటే దీర్ఘంగా ఆలోచించాల్సిన పరిస్థితి. సినిమా లో ఉన్న తప్పులు, బోరింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఇన్ని కావు. సోనూసూద్ ఈ సినిమా కి ఒక రకంగా హీరో అని చెప్పాలి. తన డీసెంట్ కామెడీ టైమింగ్ తో అందరిని నవ్విస్తాడు. నభా కూడా పర్వాలేదనిపిస్తుంది. అయితే అంతకు మించి చిత్రం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అసలు ఎనభై, తొంభై లలో వాడే కథను కమర్షియల్ హంగులు అద్ది ఎప్పుడు తీసుకొని వచ్చిన దర్శకుడు కనీసం ఇంట్రెస్ట్ ప్రేక్షకులకు కలిగించ లేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నూటికి నూరు శాతం డిజాస్టర్ అనే చెప్పాలి

చివరి మాట : అల్లుడు బెదుర్స్


Share

Related posts

అమ్మాయి న‌డిరోడ్డుపై నిల‌బ‌డి..క్షమాప‌ణ చెప్పాలంటున్న ప్ర‌దీప్ అభిమానులు

sridhar

ఎఫ్ 3 లో ఆ ఫేడవుట్ హీరో అంటే కష్టమే ..?

GRK

Ghani: `గని` ప్రీ రిలీజ్ బిజినెస్.. క్లీన్ హిట్ అవ్వాలంటే ఎంత రావాలి..?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar