రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకుడిగా పరిచయం అవుతూ విజయ్ రామ్, శివ్ శక్తి సచ్దేవ్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా ‘అమరం అఖిలం ప్రేమ’. కోవిడ్-19 కారణంగా థియేటర్ రిలీజ్ మిస్ చేసుకున్న ఈ సినిమా మొదటి టీజర్ తో ఆకట్టుకుంది. ఇక తెలుగు ఓట్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ద్వారా విడుదలైన ‘అమరం అఖిలం ప్రేమ’ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం.
కథ
చిన్ననాటి నుండి ప్రతి విషయంలో ఎంతో గారాబంగా పెరిగిన అమ్మాయి అఖిల (శివశక్తి సచ్దేవ్) నాన్న అరుణ్ ప్రసాద్ (కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్) ఐఏఎస్ కావాలని అడిగినా నేను చేయను ఇంజనీరింగ్ మాత్రమే చేస్తానని కాకినాడ లోని ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే ఒక్కసారిగా అఖిల ఐఏఎస్ చేయడం కోసం హైదరాబాద్ వెళుతుంది. ఈ లోపల మ్యూజిషియన్ కావాలనే గోల్ తో తిరుగుతున్న అమర్ (విజయ్ రామ్) అఖిలను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. మరి అఖిల ఒప్పుకుంటుందా…? అసలు ఆమె ఐఏఎస్ ఎందుకు చేస్తుంది? చివరికి ప్రేమ కథ సుఖాంతం అవుతుందా లేదా అనేది ఈ సినిమా కథ.
ప్లస్ లు
తండ్రి కూతురు సెంటిమెంట్
శివశక్తి సత్యదేవ్ నటన. రథన్ మ్యూజిక్
రసూల్ ఎల్లూర్ విజువల్స్
మైనస్ లు
రొటీన్ ప్రేమ కథ
ఊరికినే ఊహించగలిగిగే కథనం
ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ చూపకపోవడం
రన్ టైం
విశ్లేషణ
నూతన దర్శకుడు జొనాథన్ ఎడ్వర్డ్స్ కొత్తవాడైనా రాసి ఉన్న కథని స్క్రీన్ పైన పండించడంలో నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాడు. అయితే ఎంచుకున్న కథలో కీ పాయింట్ ‘ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండటం’ అనేది బాగుంది కానీ అది చెప్పడం కోసం రాసుకున్న కథ విధానం మాత్రం చాలా రొటీన్ గా ఉంది. కథనం కూడా బోరింగ్ గా ఇంట్రెస్ట్ మొమెంట్స్ లేకుండా సాగుతుంది. ఈ చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఎడ్వర్డ్స్ కి డైరెక్టర్ గా మంచి మార్కులు పడ్డాయి కానీ సినిమా మాత్రం అంత బాగా రాలేదు. ఇక శ్రీకాంత్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు సూపర్ క్లాసీ ఉండటం కలిసి వచ్చే అంశం. పూర్తి సినిమా చూసినప్పుడు ఆద్యంతం ప్రేమకథలో ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథ తో మనం కనెక్ట్ గా లేకపోవడం మైనెస్. సినిమా ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడాలనిపిస్తుంది. కథనం లో బలం లేకపోవడం వల్లే ఇదంతా
ఇంతకీ చూడొచ్చా..?
మీరు ప్రేమకథా చిత్రాలకు బానిస ఐతే తప్పించి మీకు ఈ సినిమా నచ్చకపోవచ్చు.
రేటింగ్ : 2.25/5
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!