NewsOrbit
న్యూస్ రివ్యూలు

Bangaru Bullodu review : బంగారు బుల్లోడు మూవీ రివ్యూ

Bangaru Bullodu review , బంగారు బుల్లోడు మూవీ రివ్యూ ,  చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ హీరోగా గాబంగారు బుల్లోడుచిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూజ ఝవేరి జంటగాపి.వి. గిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సుంకర రామబ్రహ్మం, అజయ్ సుంకర ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి సాయికార్తీక్ బాణీలు అందించాడు. ఒక ప్యూర్ తెలుగు కామెడీ చిత్రం చూసి ప్రేక్షకులు చాలా రోజులు అయిపోయిన సమయంలో వచ్చిన ఈ సినిమా ఎంత వరకు ఆ కొరత తీర్చిందో చూద్దాం

review-bangaru-bullodu

review-bangaru-bullodu

బంగారు బుల్లోడు మూవీ కథ

అల్లరి నరేష్…. భవాని ప్రసాద్ గా ఈ సినిమాలో కనిపిస్తాడు. అతడు బ్యాంకు ఉద్యోగి మాత్రమే కాదు బంగారు ఆభరణాలు చేయడంలో మంచి నేర్పరి కూడా. ఇక బ్యాంక్ మేనేజర్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి సినిమాలో కనిపిస్తాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం అతడి భార్యకు ఫంక్షన్లకు ఊరికే ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక ఇదే సినిమాలో హీరోయిన్ పూజ ను చూడడానికి వచ్చిన కాబోయే పెళ్లికొడుకు గా వెన్నెల కిషోర్ కనిపిస్తాడు. ఇలాంటి సమయంలో ఒక చిన్న టౌన్ బ్యాంకు ఉద్యోగి బంగారాన్ని తన సొంత పనులకు ఎలా ఉపయోగించుకున్నాడు అన్న సింపుల్ కథనం తో సినిమా మొదలవుతుంది. అయితే ఎప్పుడైతే తనికెళ్ల భరణి క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అప్పటినుండి స్టోరీ లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత గుడిలో ఆభరణాల దొంగతనం జరుగుతుం.ది దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ (అజయ్ ఘోష్) ఇన్వెస్టిగేషన్ కు వస్తాడు. ఇంతకీ ఆలయ చోరీ చిక్కుముడి వీడిందా? ఆ దొంగలను నరేష్ పట్టించాల్సిన అవసరం ఏమొచ్చెంది? అన్నీ అడ్డంకులు ఎదుర్కొని పూజ ని పెళ్లి చేసుకుంటాడా…? లేదా…? అన్నది మిగిలిన కథాంశం..!

Swathilo Muthyamantha' remix from Bangaru Bullodu: Pooja Jhaveri ups the glam quotient | Telugu Movie News - Times of India

Bangaru Bullodu review  ప్లస్ లు

  • కథలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. చాలా డీసెంట్ గా వెళ్ళిపోయిన మొదటి భాగంలో చివర్లో వచ్చిన ఇంటర్వల్ ట్విస్ట్ ప్రేక్షకులకు కొద్దిగా థ్రిల్ కు గురిచేస్తుంది. నరేష్ సినిమాల్లో ఇలాంటివి చోటు చేసుకోవడం చాలా అరుదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది.
  • వెన్నెల కిషోర్ మరొకసారి ఎందుకు తన తెలుగులో ఇప్పుడు టాప్ కామెడియన్ గా ఎందుకు కొనసాగుతున్నాడో నిరూపించుకున్నాడు. తన టైమింగ్ తో తనకి బాగా కలిసొచ్చినకాబోయే పెళ్ళికొడుకుక్యారెక్టర్ లో బాగా నవ్వులు పూయించాడు.
  • అల్లరి నరేష్ నటన కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అని చెప్పాలి. చాలా కాలం తర్వాత కామెడీ రోల్ చేస్తున్న నరేష్ ఎంతో ఈజ్ తో చేశాడు. మళ్లీ పాత నరేష్ ను గుర్తుకు తెచ్చాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా నరేష్ నటనతో మెప్పించిన తీరు నిజంగా ప్రశంసనీయం

మైనస్ లు

  • అల్లరి నరేష్ చిత్రంలో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కామెడీ ఈ సినిమాలో లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. మొదటి అర్ధ భాగంలో అయితే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ తప్పించి పెద్దగా కామెడీ లేదు.
  • కొన్ని సీన్లు మరి బలవంతంగా రాసుకున్నట్టు అనిపిస్తుంది. సింపుల్ స్టోరీ కి అనవసరమైన మసాలా కలపడంతో సినిమా కొద్దిగా సాగుతుంది. దానివల్ల అసలైన కథలోకి రాకుండా అనవసరమైన పాత్రల చుట్టూ కొద్దిసేపు ఈ చిత్రం నడుస్తుంది.
  • కేస్ ఇన్వెస్టిగేషన్ సీన్లు, రెండవ అర్ధ భాగంలో కామెడీ పూర్తిగా తేలిపోయాయి. చాలా అంశాలు బాగా డౌన్ అయిపోయాయి…. ఎన్నో సిల్లీ సీన్ల తర్వాత ఎప్పటికో కథ మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది.
  • సినిమా క్లైమాక్స్ చాలా తొందరగా గడుస్తుంది. అనవసరమైన సన్నివేశాలు దగ్గర వృధా చేసిన సమయాన్ని ఇక్కడ ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో కవర్ చేయాలని చూశారు కానీ బాగా ఇబ్బంది పడ్డారు. రెండవ అర్ధ భాగంలో సినిమా స్లో కావడం అతి పెద్ద మైనస్.

Allari Naresh becomes Bangaru Bullodu - tollywood

విశ్లేషణ :

అల్లరి నరేష్ హీరోయిన్ పూజ ఝవేరీ తమ క్యారెక్టర్ల లలో బాగానే ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్. సత్య వంటి మంచి కామెడియన్లు చేసిన కామెడీ కూడా బాగా పండింది. కథ చాలా సింపుల్గా చిన్న బడ్జెట్ సినిమా కి తగ్గట్టు డీసెంట్ గా ఉంది. అయితే అనవసరమైన పాత్రలు క్రియేట్ చేయడంకంటెంట్ ఎక్కువగా లేకుండా బలవంతంగా రాసుకున్న కామెడీ సీన్లు…. ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇందులో కలపడం వల్ల సినిమా బాగా బోర్ కొట్టేస్తోంది. మొదటి అర్ధ భాగంలో అల్లరి నరేష్ మార్కు కామెడీ మిస్ అవుతుంది. వెన్నెల కిషోర్ కొద్ది వరకు ఈ సినిమాను లాక్కొచ్చాడు కాని రెండవ అర్ధ భాగంలో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. ఇక్కడ ప్రేక్షకులకు విపరీతమైన బోర్ కొడుతుంది. సినిమా క్లైమాక్స్ రోటీన్ గా హ్యాపీ ఎండింగ్ తో వస్తుంది. మధ్యలో రెండో భాగంలో స్వాతి ముత్యపు జల్లులలో పాట ప్రేక్షకులకు కొద్దిగా ఉపశమనం అనే చెప్పాలి. 

మొత్తానికిబంగారు బుల్లోడుచిత్రం బాగా బోర్ కొట్టించే ఒక బిలో యావరేజ్ సినిమా..!

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?