NewsOrbit
బిగ్ స్టోరీ రివ్యూలు

రివ్యూ : కలర్ ఫోటో – ఆహా ఓటిటి

చిన్న సినిమాలలో ఈ మధ్యకాలంలో అతిపెద్ద హైప్ తెచ్చుకున్న సినిమా కలర్ ఫోటో. అద్భుతమైన టీజర్ , ట్రైలర్ , పాటలతో మంచి రెస్పాన్స్ సాధించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. యూట్యూబ్ ద్వారా రైటర్, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సందీప్ తన స్నేహితుడైన కమెడియన్ సుహాస్ హీరోగా, తెలుగు యువ ట్యాలెంటెడ్ చాందిని చౌదరి హీరోయిన్ గా, ప్రముఖ హాస్యనటుడు సునీల్ విలన్ గా నటించిన సినిమా ఈ రోజు ఆహా ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది లేదో చూద్దాం…

 

కథ

కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గరలోని ఒక గ్రామంలో 90లలో జరిగిన కథ ఇది. జయకృష్ణ (సుహాస్) దీప్తి వర్మ (చాందిని చౌదరి) ఒకే కాలేజీ లో చదువుకుంటారు. మొదటి చూపులోనే దీప్తి అంటే కృష్ణ ఇష్టపడతాడు. కానీ తన రంగు వల్ల తన ప్రేమ గురించి చెప్పడానికి ధైర్యం సరిపోదు. కృష్ణ అదృష్టం కొద్దీ దీప్తికి కూడా కృష్ణ అంటే ఇష్టం ఉండడంతో చివరికి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోబియా నుండి బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉండగానే .. ఊహించని విధంగా దీప్తి రివర్స్ లో వచ్చి కృష్ణ కి తన ప్రేమ గురించి చెప్పడం… కృష్ణ ఒప్పుకోవడం తో అసలు కథ మొదలు అవుతుంది.  అదేసమయంలో పోలీస్ ఆఫీసర్ అయిన రామరాజు (సునీల్) కి ఈ విషయం తెలియడంతో దీప్తి ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు . ఇక ఆ తర్వాత తన ప్రేమని దక్కించుకోవడానికి కృష్ణ ఏం చేశాడు…? రామరాజును ఎలా ఎదిరించాడు అన్నది కథ. అసలు కృష్ణ దీప్తి లు మళ్లీ ఒక్కటయ్యారా… అన్నది కథాంశం.

ప్లస్ పాయింట్స్

సుహాస్, చాందిని ల అద్భుతమైన పర్ఫార్మెన్స్
సునీల్ లాంటి సీనియర్ నటుడి సపోర్టు
వైవా హర్ష కామెడీ
సోల్ ఫుల్ మెలోడీ
మంచి క్లైమాక్స్

నెగెటివ్ పాయింట్స్

రెండవ అర్ధ భాగం బాగా స్లో అనే కంప్లైంట్ వినిపిస్తుంది
లవ్ ట్రాక్ లో కెమిస్ట్రీ అక్కడక్కడా మిస్ అయ్యింది అనిపిస్తుంది
రొటీన్ కథాశం

విశ్లేషణ

చాలా సింపుల్, సెన్సిటివ్ కథ అయినా కలర్ ఫోటో కథాంశాన్ని 1997 బ్యాక్ డ్రాప్ లో చెబుతూ  డబ్బు, కులం, మతం వర్ణ వివక్ష నేపథ్యంలో సందీప్ రాజ్ నరేషన్ చాలా చక్కగా  ఇచ్చాడు అనే చెప్పాలి. మొదటి భాగంలో వైవా కామెడీ తో మెప్పిస్తాడు. ఇక కథ ఎప్పుడు మొదలవుతుంది అన్న ఫీలింగ్ వచ్చేసరికి ఇంటర్వెల్ దగ్గర కథ మొదలవుతుంది. ఇక రెండవ భాగంలో అంతా రొటీన్ గా జరుగుతుండడం కొంచెం విసుగు తెప్పిస్తాయి. ప్రేమ కథకు కీలకమైన ఎమోషనల్ సీన్స్ చేయడంలో సందీప్ కొన్ని చోట్ల తడబడ్డాడు. కానీ ఆఖరి ఇరవై నిమిషాలు మాత్రం సందీప్ ప్రేక్షకులని తన వైపు పూర్తిగా తిప్పేసుకున్నాడు .. ప్రేక్షకులని ముగ్దులని చేస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే నడిపించాడు. క్లైమాక్స్ లో కంట్లో నీళ్ళు తెప్పించే విధంగా తీశాడు సందీప్.  నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటులు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. లవ్ స్టోరీస్ ఇష్టపడేవావారికి ఈ సినిమా మస్ట్ వాచ్ అవుతుంది. నార్మల్ ప్రేక్షకులు కూడా ఒక్కసారి తప్పనిసరిగా చూడాల్సిన సినిమా.

చివరి మాట : కలర్ ఫోటో  కంట్లో నీళ్ళు తెప్పించింది 

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri