Review : హాలీవుడ్ చిత్రాల్లో విశేష ఆదరణ పొందిన చిత్రాల్లో ‘గాడ్జిల్లా‘, ‘కింగ్ కాంగ్‘ ముందు వరుసలో ఉంటాయి. అవెంజర్స్, జస్టిస్ లీగ్, అవతార్ లాంటి పెద్ద సినిమాల తర్వాత ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్‘ చిత్రం ట్రైలర్ సొంతం చేసుకున్న హైప్ భారతదేశంలో మరే హాలీవుడ్ చిత్రం సొంతం చేసుకోలేదు. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…
Review : కథ
సింపుల్ గా స్టోరీ చెప్పాలంటే ఈ సినిమాలో గాడ్జిల్లా విలన్. సముద్రంలో ఉండే గాడ్జిల్లా ఉన్నట్టుంది జనసంద్రం లోకి వచ్చి విలయతాండవం చేస్తుంది. గాడ్జిల్లా కు ఈ సారి అధిక శక్తులు ఉంటాయి. భవనాలను, ఆస్తులను ధ్వంసం చేస్తూ మనుషుల ప్రాణాలు హరిస్తుంటుంది. ఈ తరం టెక్నాలజీ తో కూడా దానిని ఆపతరం కాదు. దానిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అప్పటికే తమ ఆధీనంలో ఉన్న కాంగ్ ని పోటీకి దింపాలని మనవ జాతి అనుకుంటారు. కానీ కాంగ్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? చివరికి వీరిద్దరి మధ్య ఫైట్ లో ఎవరు గెలిచారు..? అన్నదే సినిమా…
ప్లస్ లు
- రెండు అతి భారీ ప్రాణులు పోరాడుతున్నప్పుడు… ఫైట్ సీక్వెన్స్ లు తెరకెక్కించడం చాలా కష్టం. అయితే ఈ చిత్రం లో మాత్రం ఇవి అద్దిరిపోయాయి చెప్పాలి.
- విజువల్ ఎఫెక్ట్స్ కు ఈ చిత్రానికి అనేక అవార్డులు రావచ్చు. అంతటి క్వాలిటీతో సినిమా విజువల్స్ తెరకెక్కాయి.
- బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. జనాల ఫీల్ ను మరొక రేంజ్లో ఎలివేట్ చేస్తుంది.
- ఇక చివరి 20 నిమిషాల ఫైట్ అయితే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని పోరాట సన్నివేశాన్ని తెరపైన చూస్తారు.
మైనస్ లు
- కథలో గ్రిప్పింగ్ పాయింట్ పెద్దగా ఉండదు. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఉన్నప్పటికీ స్టోరీ మరింత బలంగా రాసుకొని ఉండవలసింది.
- గాడ్జిల్లా కు అంతటి సూపర్ పవర్స్ ఇచ్చిన తర్వాత నేటి టెక్నాలజీ దానిని ఆపలేకపోయింది అనే పాయింట్ ప్రేక్షకులకు కొంచెం అతిశయోక్తి లా అనిపించొచ్చు. కానీ బిల్డప్ కోసం ఇలా చేశారు అని అనుకుంటారు.
Review : విశ్లేషణ
పూర్తిస్థాయి యాక్షన్ ఫిలిం ఫీలింగ్ తెచ్చేందుకు తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యద్భుత విజువల్స్… అబ్బురపరిచే పోరాట సన్నివేశాలు… అలాగే గ్రాఫిక్స్… అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ విషయంలో మరికొంత దృష్టి పెట్టి ఉంటే చరిత్రలో నిలిచిపోయే సినిమా అయ్యేది కానీ ఇప్పటికీ గాడ్జిల్లా vs కాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయే సినిమా. మామూలు సమయంలో రిలీజ్ అయి ఉంటే ప్రపంచ బాక్సాఫీసును షేక్ చేసేది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!