NewsOrbit
రివ్యూలు

రివ్యూ : కృష్ణ అండ్ హిస్ లీల – హిట్టా ఫట్టా?

లాక్ డౌన్ కారణంగా ఓటిటి ప్లాట్ఫార్మ్ లో చాలా రోజులుగా థియేటర్లకు నోచుకోని సగటు సినీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింన ప్రేమ కథ చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. సురేష్ ప్రొడక్షన్స్, వియా కామ్ 18 వంతి ప్రముఖ ప్రొడక్షన్లో నిర్మించబడిన చిత్రానికి క్షణంతో అందరినీ మెప్పించిన రవికాంత్ పేరపు దర్శకత్వం వహించారు . సినిమా నెట్ఫ్లిక్స్ లో స్క్రీన్ అవుతుండగా మధ్య కాలంలో మంచి రొమాంటిక్ బాణీలను అందిస్తున్న శ్రీ చరణ్ పాకల దీనికి మ్యూజిక్ అందించారు.

 

 

Krishna And His Leela Movie Review: A thoughtful rom-com - Movies News

 

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వద్నికట్టి ముఖ్యపాత్రల్లో నటించిన త్రికోణపు లవ్ స్టోరీ లోకి ఒక సారి తొంగి చూస్తే

కథ: కృష్ణ (సిద్ధు జొన్నలగడ్డ) మొదట సత్య (శ్రద్ధా శ్రీనాథ్) తో వైజాగ్ లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ప్రేమిస్తాడు. ఇక వీరిద్దరికీ బ్రేకప్ అయిపోయిన తర్వాత సత్య బెంగళూరులో జాబ్ వచ్చి వెళ్లిపోతుంది. అయితే కృష్ణ అదే కాలేజీలో చదువుతున్న రాధ (షాలిని) తో ప్రేమలో పడతాడు. ఇక కృష్ణకు సత్య ను కంపెనీ అయితే జాబ్ కు తీసుకుందో వారే ఇతనికి కూడా జాబ్ ఇచ్చి ట్రైనింగ్ కోసం బెంగళూరుకు పంపిస్తారు. సత్యను మరలా కలిసిన కృష్ణ ఆమెతో రొమాన్స్ చేయడం మొదలుపెడతాడు. ఇలా కృష్ణ ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో సంబంధం కొనసాగిస్తాడు. చివరికి ఏమవుతుంది అన్నది కథ.

ప్లస్ : శ్రీ చరణ్ పాకల మ్యూజిక్ చిత్రానికి పెద్ద పాజిటివ్. చాలా ఆధునికమైన థీమ్ లో కొనసాగిన అన్ని పాటలు మనసు హత్తుకోగా…. సినిమాటోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది. ఇక పోతే సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది డైలాగ్స్ గురించి. ప్రతి ఒక్క డైలాగ్ సినిమా చూసే ప్రతి ప్రేమికుడి చాలా గట్టిగా తగులుతుంది. అలాగే రొమాంటిక్ సీన్స్ తీసే విషయంలో కూడా దర్శకుడు చాలా శ్రద్ధ వహించి ఎక్కడ రొటీన్ ఫార్మాట్ వాడకుండా జాగ్రత్త పడ్డాడు.

మైనెస్ : సినిమాకు పెద్ద మైనస్ ఏమిటంటే సినిమా మొదలైన కొద్ది సేపటికే కథ చివరికి ఎలా ముగుస్తుందో అందరూ ఊహించేయొచ్చు. ఇకపోతే స్క్రీన్ ప్లే కూడా అంత గొప్పగా ఏమీ లేదు. అద్భుతమైన థ్రిల్లర్ క్షణంను తెరకెక్కించిన రవికాంత్ ఒక లవ్ స్టోరీ కి స్క్రీన్ ప్లే రాయడంలో ఇబ్బంది పడ్డాడు అంటే ఆశ్చర్యపరిచే అంశమే. ఇకపోతే త్రికోణపు లవ్ స్టోరీని చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకులకు ఫీల్ వచ్చేందుకు అలా చేశారో ఏమో తెలియదు కానీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ కి వచ్చే సమయానికి ఒక్కో సీన్ ఉండవలసిన నిడివి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎడిటర్ కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సింది అనే చెప్పాలి.

పర్ఫామెన్స్ : జెర్సీ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ప్రొఫెషనల్ గా సత్య పాత్రలో ఒదిగిపోయింది. ఇక కొత్త అమ్మాయి అయిన షాలిని ఫర్వాలేదనిపించగా వైవా హర్ష కామెడీ మరి ఊహించినంతగా ఏమీ లేదు. ఇక మెయిన్ పర్ఫామర్ అయిన మన కృష్ణ (సిద్ధు జొన్నలగడ్డ) లవర్ బాయ్ గా పర్వాలేదనిపించాడు కానీ అతని క్యారెక్టర్ చాలా రొటీన్ గా ఉంది. ఇక తన చక్కటి యాక్టింగ్ స్కిల్స్ తో మంచి మార్కులే కొట్టేశాడు అనుకోండి.

చివరగా: ప్రేమ కథా చిత్రాలను బాగా ఇష్టపడే వారీ డైలాగ్స్ భారీగా కనెక్ట్ అవుతాయి. మిగతా జోనల్స్ ఇష్టపడే వారు ఇక మేము చాలా ఖాలీగా ఉన్నాం అంటే ఒకసాతి చూసేయొచ్చు…. అలా టైమ్ పాస్ గా….

రేటింగ్: 2.75/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar