Asalu 2023 Movie Review: చాలాకాలం తర్వాత రవిబాబు దర్శకత్వంలో “అసలు” అనే సినిమా నేడు రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
నటీనటులు: రవిబాబు, పూర్ణ, సూర్య, సత్య కృష్ణన్, ప్రణవి మనుకొండ
దర్శకులు : ఉదయ్, సురేష్
నిర్మాతలు: రవి బాబు
సంగీత దర్శకులు: ఎస్ ఎస్ రాజేష్
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
ఎడిటర్: సత్యనారాయణ బల్లా
పరిచయం:
నటుడు రవిబాబు అందరికీ సుపరిచితుడే. చలపతిరావు కొడుకుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రవిబాబు తనకంటూ సెపరేట్ గుర్తింపు పొందుకున్నాడు. చాలా సినిమాలలో విలన్ పాత్ర చేసి మెప్పించాడు. 2002లో “అల్లరి” సినిమాతో దర్శకుడిగా మారిన రవిబాబు పలు సినిమాలు చేయడం జరిగింది. దర్శకుడిగా తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పట్లో కామెడీ నుండి థ్రిల్లర్స్ దాకా రవిబాబు రైటింగ్ ఇండస్ట్రీలో చాలా బాగుండేది. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కోవటం జరిగింది. ఈ క్రమంలో చాలా వరకు దర్శకత్వానికి దూరంగా ఉన్న రవిబాబు తాజాగా “అసలు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దర్శకుడిగా ఒక పక్క చేస్తూనే మరోపక్క నటుడిగా సినిమాలో నటించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది.
స్టోరీ:
ఆన్ లైన్ క్లాస్ లో నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ వెంకటేష్ చక్రవర్తినీ ఓ ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి చంపేస్తారు. జూమ్ మీటింగ్ జరుగుతూ ఉండగానే స్టూడెంట్స్ అందరూ చూస్తుండగా ప్రొఫెసర్ ను అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేస్తాడు. ఈ హత్య కేసును చేదించడానికి సీఐడీ ఆఫీసర్ రంజిత్ (రవిబాబు) రంగంలోకి దిగటం జరుగుతుంది. ఇంతకీ ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు..?, ఈ కేసును రంజిత్ ఏ రకంగా చేదించాడు. ప్రొఫెసర్ సహాయకురాలు వందన(పూర్ణ) అనే అమ్మాయి రంజిత్ కి ఏ రకంగా సహాయం చేసింది..?
విశ్లేషణ:
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రమోషన్ కార్యక్రమంలో చూపించిన గాని సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ముందే ఊహించవచ్చు. ముఖ్యంగా రైటింగ్ అంటే రవిబాబు…అటువంటిది అసలు సినిమాలో రైటింగ్ చాలా వీక్ అని చెప్పవచ్చు. సినిమా మొత్తానికి స్టార్టింగ్ లో సిఐడి ఆఫీసర్ గా రవిబాబు టేకప్ చేసిన కేస్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. దీంతో ఎంతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హీరో ఇంట్రడక్షన్ ఉండటంతో… ప్రొఫెసర్ హత్య కేసు అంతకుమించి అని ప్రేక్షకులకి భావన కలుగుద్ది. కానీ తీరా చూస్తే ఈ హత్య కేసు మెయిన్ థీమ్ ముందే చెప్పేయటం మైనస్ అయ్యింది. ఈ ప్రొఫెసర్ హత్య అసలు ఎందుకు జరిగింది అనేది ముందే రివిల్ చేయడంతో…. ఎక్కడ కూడా థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఎఫెక్ట్ ప్రేక్షకులకు కలగదు. మెయిన్ పాయింట్ బయటపడ్డాక సినిమా చాలా ఫ్లాట్… రొటీన్ సబ్జెక్టు తరహాలో ఉంటది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఏదో అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తది. చాలెంజింగ్ సబ్జెక్టులో… ఏ పాత్ర కూడా అంతగా స్ట్రగుల్ అయినా స్టఫ్ ఎక్కడ కనిపించలేదు. స్టోరీ రొటీన్ గా వెళుతూనే క్యారెక్టర్ లు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. నటన పరంగా సినిమాలో రవిబాబు మినహా మిగతా పాత్రలు అంతగా ఏమీ ఆకట్టుకోలేదు.
ప్లస్ పాయింట్స్:
రవిబాబు
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
స్టోరీ.