తమిళంలో టాప్ డైరెక్టర్లుగా పేరుమోసిన సుధ కొంగర, వెట్రిమారన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విగ్నేష్ శివన్ లతో కలిసి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ ‘పావ కథైగల్’ అనే చిత్రాన్ని నిర్మించింది. అంజలి, సాయిపల్లవి, సిమ్రాన్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, కాళిదాసు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం పైన తెలుగువారికి కూడా అనేక అంచనాలు ఉన్నాయి ఒకే సమయంలో నాలుగు కథలను ప్రస్తావించే ఆంథాలజీ అయినా ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…
కథ (లు)
ఇది ఆంథాలజీ కావడం వలన ఇందులో నాలుగు కథలు ఉంటాయి
థంగం : సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ భాగంలో స్వలింగ సంపర్కుడు అయినటువంటి కాళిదాసు థంగం ( సంతను) తో ప్రేమలో పడతాడు. అయితే తన చెల్లి తోనే థంగం ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అని తెలిసి అతని గుండె బద్దలవుతుంది.
లవ్ పన్న ఉత్రనుం : విగ్నేష్ శివ దర్శకత్వం వహించిన ఈ కథ బయట ప్రజల మధ్య కులాంతర వివాహాలను ప్రోత్సహించే రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యే వ్యక్తి తన సొంత బిడ్డలు విషయం లోకి వచ్చేసరికి ఎలా ప్రవర్తిస్తాడు .. ఎలా మారుతాడు అన్న కథను చెబుతుంది.
వాన్ మగల్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ కథలో ఒక 12 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైన తర్వాత ఐదుగురు వ్యక్తులు ఉన్న ఆ బాధితురాలి కుటుంబం ఎలా రియాక్ట్ అవుతారు అన్నదానిపై నడుస్తుంది.
ఊర్ ఇరువు : తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయి పెళ్లి చేసుకున్న సాయి పల్లవి కి గర్భం వస్తుంది .అయితే తన పరువు కోసం ప్రకాష్ రాజ్ ఏమి చేసాడు అనేది తర్వాతి కథ.
ప్లస్ లు
నటీనటుల పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది
సినిమాటోగ్రఫీ
సంగీతం
కథల్లోని ఎమోషనల్ ఎలిమెంట్స్
మైనస్ లు
రొటీన్ కథాంశాలు
పెద్దగా ట్విస్టులు లేకపోవడం
స్లో స్క్రీన్ ప్లే
సరిగ్గా క్లైమాక్స్ పండకపోవడం
విశ్లేషణ
ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నలుగురు టాప్ దర్శకులు ద్వారా తెరకెక్కి బడింది. అయితే వీటిలో ప్రస్తావించే అంశాలలో ఎమోషన్స్ బాగా పండినప్పటికీ కథ చాలా చప్పగా సాగుతున్నట్లు అనిపిస్తుంది తర్వాత ఏమి జరుగుతుందో ముందే ఊహించవచ్చు. అంతేకాకుండా ప్రతి కథకు ముగింపు ఇవ్వడంలో దర్శకులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు అనే చెప్పాలి. పెద్దగా ట్విస్టులు లేకపోవడంతో సినిమా చాలా స్లో గా ఉన్నట్లు అనిపిస్తుంది. దర్శకులలో సుధ, వెట్రిమారన్ కథలు చాలా బాగా వచ్చాయి గౌతమ్, విగ్నేష్ డీల్ చేసిన కథలు పర్వాలేదనిపించాయి.