క్రిస్మస్ తొలి ఏకాదశి పురస్కరించుకుని ఈ రోజు భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ‘షకీలా’ ఒకటి. దక్షిణ భారతదేశ సినీ ఇండస్ట్రీని తన అందాలతో ఒక ఊపేసిన ‘షకీలా’ బయోపిక్ ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఆ బోల్డ్ లేడీ జీవిత చరిత్రను ఎలా తీశారో చూద్దాం…
కథ
షకీలా (రిచా చద్దా), (కాజోల్ చగ్ – టీనేజీ) సౌత్ ఇండియాలోని ఒక మామూలు టీనేజీ అమ్మాయి. స్కూలుకు, తండ్రితోపాటు చేపల వేటకు వెళుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. షకీలా తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం ఆమె తల్లి మీద పడుతుంది. ఆమె తల్లి ఒకప్పుడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా కాలం గడిపింది. ఇక ఆమె పిల్లలను కేరళలోని కొచ్చిన్ మెట్రోపోలీస్ కు తీసుకొని వస్తుంది. పిల్లలు అందరిలో పెద్దది అయిన షకీలా ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత వస్తుంది. ఒక అమాయకపు టీనేజ్ పిల్లగా సినిమాల్లో తన ప్రయాణం మొదలుపెట్టిన షకీలా దక్షిణ భారతదేశంలోనే వివాదాస్పద నటిగా ఎలా మారింది? ఒక్కసారిగా ఆమె అంతటి కీర్తి ఎలా సంపాదించింది… అలాగే రెప్పపాటులో ఎలా పడిపోయింది అన్నదే చిత్రం.
ప్లస్ లు
బలమైన కథనం
పంకజ్ త్రిపాఠి, రీచా చద్దా అద్భుత నటన
టీనేజి షకీలా
మైనస్ లు
పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ లేకపోవడం
కథను మరింత లోతుగా విశ్లేషించవలసింది
సీన్లకు బదులు మాంటేజ్ లతో కీలక సన్నివేశాలు తీయడం
దారుణమైన మ్యూజిక్
అంతంత మాత్రమైన ప్రొడక్షన్ వాల్యూస్
విశ్లేషణ
షకీలా లాంటి వివాదాస్పద నటి జీవిత చరిత్ర మీద చిత్రం తీస్తున్నప్పుడు ప్రేక్షకులు కొన్ని విశ్లేషణల కోసం వెతుకుతారు. అయితే కథ విషయంలో దర్శకుడు బాగా కాంప్రమైజ్ అయినట్లు తెలిసిపోతుంది. హీరోయిన్ రిచా చాద్దా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది కానీ దక్షిణ భారతదేశానికి చెందిన అమ్మాయిగా షకీలా గా నటించడం లో కొద్దిగా తడబడింది. ఇక 90లలో, 21వ శతాబ్దంలో జరిగిన కథను అందుకు తగ్గట్టు చూపించడంలో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు అనే చెప్పాలి. సినిమా పరిగెడుతున్నట్లు ఉంటుంది. కీలక సన్నివేశాలను కూడా మాంటెజ్ లలో రూపంలో చూపించడం అనేది అతి పెద్ద మైనస్. అయితే షకీలా ఒక నిజాయితీతో కూడుకున్న సినిమా అయినప్పటికీ ఆమె గురించి మనకు తెలియని కథ అని చెప్పారు కానీ తెలియాల్సిన కథ ను చెప్పలేదు. రైటింగ్ మరికొంచెం బోల్డ్ గా ఉండి ఉంటే ఈ చిత్రం మరింత బాగుండేది. అయితే వివాదాస్పద నటి బయోపిక్ కావడం వల్ల ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యపరుస్తాయి. మొత్తానికి షకీలా ఒక యావరేజ్ చిత్రం అని చెప్పవచ్చు
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!