Romancham Review: ఆత్మతో బ్యాచిలర్ గ్రూపు సభ్యులు ఆడిన ఆట “రోమాంచమ్” మూవీ. ఈ గేమ్ లో ఆత్మ రావడం వచ్చాక జరిగిన కామెడీ.. హర్రర్ విశేషాలు అంతా ఇంత కాదు.
సినిమా పేరు: రోమాంచం
నటీనటులు: సౌబిన్ షాహిర్, అనంతరామన్ అజయ్, సజిన్ గోపు, అబిన్ బినో, సిజు సన్నీ, అఫ్జల్ పీహెచ్, జగదీష్ కుమార్, అర్జున్ అశోకన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సను తాహిర్
దర్శకత్వం: జితు మాధవన్
సంగీతం: సుషిన్ ష్యామ్
నిర్మాతలు: జాన్ పాల్ జార్జ్, గిరీష్ గంగాధరన్, జోబి జార్జ్
ఓటీటీ విడుదల తేది: ఏప్రిల్ 7 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
పరిచయం:
“రోమాంచమ్” అనే సినిమా మలయాళం నుండి తెలుగులో డబ్ అయిన మూవీ. నెల క్రితం మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో రెండు గంటల పదినిమిషాల నిడివితో శుక్రవారం ఓటిటి హాట్ స్టార్ లో రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ సినిమా స్టోరీ ఇంకా అనేక విషయాలు గురుంచి తెలుసుకుందాం.
స్టోరీ:
బెంగళూరులో ఓ ఇంట్లో జీవన్, నీరజ్, హరి, రవి అనే ఏడుగురు స్నేహితులు నివసిస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో జాబ్. అయితే ఎప్పుడూ ఖాళీగా ఉండే జీవన్.. బెంగళూరులో ఇతర స్నేహితుల రూమ్ లోకి వెళ్తూ అక్కడ ఉండే ఓయిజా బోర్డు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో తన రూమ్ లో ఉన్న స్నేహితులను సర్ప్రైజ్ చేయాలని ఆ బోర్డు రూమ్ కి తీసుకురావడం జరుగుద్ది. ఓయిజా బోర్డు ద్వారా చనిపోయిన ఆత్మలను పిలిచి ప్రశ్నలు అడిగే గేమ్. సో అలా ఈ జీవన్ గ్యాంగ్ ఆడే ప్రక్రియలో ఒక ఆత్మ వచ్చి.. వీళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటది. ఇంతకీ వచ్చిన ఆత్మ ఎవరు..? ఎందుకు జీవన్ గ్యాంగ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది..? ఆ ఆత్మ వల్ల జీవన్ గ్యాంగ్ ఎదుర్కొన్న ప్రమాదాలు ఏమిటి..? అనేది స్టోరీ.
విశ్లేషణ:
సినిమా స్టార్ట్ అయిన అరగంటకి మెయిన్ స్టోరీ లేని వెళ్లడానికి చాలా టైం పడద్ది. మొదటి అరగంట పాత్రలు వారికి సంబంధించిన ఇంట్రడక్షన్ సన్నివేశాలు. గ్యాంగ్ లో ఉన్న సభ్యుల అలవాట్లు వాళ్లు కామెడీ పరవాలేదు. అయితే ఈ గ్యాంగ్ తోపాటు మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవుద్ది అసలు ఎందుకు.. ఆ పాత్ర వచ్చింది అన్నది సినిమాలో ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఈ దయ్యాల గేమ్ ఆట మూడో అరగంట నుండి స్టార్ట్ అవుద్ది. చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమా కొనసాగుతూ మధ్యలో ఆత్మ రాగానే జరిగే కామెడీ చాలా అద్భుతంగా దర్శకుడు జీతూ మాధవన్ చూపించడం జరిగింది. గ్యాంగ్ లో నటులు సౌబిన్ షాహిర్… పాత్ర చాలా హైలెట్ గా చూపించారు. అయితే దయ్యాల గేమ్ ఆడుతుండగా వచ్చిన ఆత్మ ఎవరిది ఎందుకు ఈ గ్యాంగ్ ని వదలడం లేదన్నది.. జస్టిఫికేషన్ చేయలేకపోయారు. సైకో మాదిరిగా చూపించిన పాత్రని ఎందుకు వాడుకున్నారు ఇంకా బాత్రూంలో.. ఉన్న ఫ్రెండ్ ఏమయ్యాడు అనే వాటికి.. దర్శకుడు న్యాయం చేయలేక లాజిక్ లేని కామెడీ హర్రర్ తో “రోమాంచమ్” తెరకెక్కించటం జరిగింది. సినిమాలో కామెడీ, హర్రర్ సన్నివేశాలు పర్వాలేదనిపించింది. కానీ అనవసరమైన సన్నివేశాలు చాలా ఉండటంతో కాస్త.. కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది.
ప్లస్ పాయింట్స్:
సౌబిన్ షాహిర్
అక్కడక్కడ కామెడీ
హర్రర్ సీన్స్
క్లైమాక్స్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
లెంగ్త్ ఇంట్రడక్షన్ సీన్స్
కన్ఫ్యూజన్ క్యారెక్టర్స్.