Rowdy boys movie review : రౌడీ బాయ్స్ మూవీ రివ్యూ

Share

Rowdy boys movie review : దిల్ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన ఆశిష్ హీరోగా డెబ్యూ చేసిన చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రోమోలతో ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

Rowdy boys movie review
Rowdy boys movie review

Rowdy boys movie review కథ:

అక్షయ్ (ఆశిష్) ఎల్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. కావ్య (అనుపమ పరమేశ్వరన్) బిఎంసి మెడికల్ కాలేజ్ లో ఒక మెడికో. వాళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? ఆ తర్వాత పరిణామాలు ఏంటి? ఇది రెండు కాలేజ్ ల మధ్య యుద్ధానికి ఎలా దారి తీసింది అన్నది ప్రధాన కథ.

నటీనటులు:

దిల్ రాజు కుటుంబం నుండి వచ్చిన ఆశిష్, రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన విషయం తెల్సిందే. చూడటానికి ఆశిష్ బాగున్నాడు. హీరోగా అవ్వడానికి ముందు ఆశిష్ ట్రైనింగ్ తీసుకున్నట్లు అర్ధమవుతోంది. డ్యాన్స్ ల పరంగా ఆశిష్ బాగా ఇంప్రెస్ చేస్తాడు. యాక్షన్ పరంగా కూడా ఓకే. నటన పరంగా అనుభవంతో మెరుగవుతాడు అనిపిస్తుంది. ముఖ్యంగా బాయ్ నెక్స్ట్ డోర్ లుక్స్ తనకు ప్లస్ అవుతాయి.

ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో చాలా సన్నగా కనిపిస్తుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తుంది. నటన పరంగా ఆమెకు పెద్దగా పెర్ఫార్మన్స్ పరంగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో అనుపమ రాణించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఓకే. సీనియర్ గా నటించిన కార్తీక్ రత్నం బాగానే చేసాడు. అయితే తన పాత్రను సరిగ్గా తీర్చిదిద్దలేదు అనిపిస్తుంది. తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు.

తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్ కూడా తమ తమ పాత్రల్లో రాణించారు. మిగతా వారు మాములే.

సాంకేతిక నిపుణులు:

యూత్ ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం కావడంతో సంగీతానికి ఈ చిత్రంలో ప్రాధాన్యత బాగా కల్పించారు. తన పాత్రకు దేవి వంద శాతం న్యాయం చేసాడు. సాంగ్స్ వినడానికి బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. మొత్తానికి దేవి మంచి అవుట్ పుట్ ఇచ్చాడు.

ఈ చిత్రం కోసం ముగ్గురు సినిమాటోగ్రఫర్స్ పనిచేసారు. మధి, విజయ్ చక్రవర్తి, గుహన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. అయితే విజువల్ గా ఎక్కడా తేడా కనిపించదు. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా, కలర్ ఫుల్ గా ఉంటుంది. అంతటా గ్రాండ్ గా అనిపిస్తుంది. మధు ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. బాగానే ఉంది. అయితే కొన్ని చోట్ల ట్రిమ్మింగ్ అవసరం అనిపిస్తుంది.

ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలకు వస్తే రొటీన్ స్టోరీకే కాలేజ్ సెటప్ నేపథ్యంలో కాలేజ్ కుర్రాళ్ళ మధ్య పోరాటాలు, లవ్ స్టోరీలు అంటూ ఎవర్ గ్రీన్ స్టోరీ తీసుకున్నాడు దర్శకుడు హర్ష కొనుగంటి. నరేషన్ పరంగా అక్కడక్కడా మెరుపులు ఉండగా మొత్తంగా చూసుకుంటే రౌడీ బాయ్స్ నిరాశపరుస్తుంది.

Rowdy boys movie review
Rowdy boys movie review

విశ్లేషణ:

హుషారు వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తీసిన హర్షకు ఈసారి భారీ కాన్వాస్ దొరికింది. సూపర్బ్ టెక్నిషియన్స్ కుదిరారు. అయితే నరేషన్ లో అప్స్ అండ్ డౌన్ ప్రేక్షకుడి ఎక్స్పీరియన్స్ కు ఇబ్బందిగా మారతాయి. మ్యూజికల్ గా, విజువల్ గా ఇంప్రెస్ చేయడం ఈ చిత్రంలో ప్రధాన ప్లస్ పాయింట్. మొత్తంగా రౌడీ బాయ్స్ ఒక సాధారణంగా నిలిచే యూత్ ఫుల్ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ.


Share

Related posts

రివ్యూ

Siva Prasad

Master Review : విజయ్ “మాస్టర్” రివ్యూ..!!

sekhar

First look: Priyamani is stunning as ‘Comrade Bharathakka’

arun kanna