టాలీవుడ్ లో ఎంతో పేరు మోసిన దర్శకులలో ఒకరైన పూరి జగన్నాథ్ యొక్క శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయమవుతూ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ’47 డేస్’ ఎట్టకేలకు ఓటిటి ప్లాట్పార్మ్ లో విడుదలైంది. 2019లోనే ఈ చిత్రం అన్నీ పనులు పూర్తి చేసుకోగా పలుసార్లు వాయిదా పడింది. ఎక్కువ సార్లు వాయిదా పడిన చిత్రం యొక్క రిజల్ట్ కొంచెం తేడా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరి ఈ థ్రిల్లర్ దానిని అధిగమించి ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది ఒక సారి చూద్దాం….
కథ : సత్యదేవ్ మరియు పూజ జవేరి జంటగా నటించిన ఈ చిత్రం పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. ముందు ఫినిక్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎం డి శ్రీనివాస్ మృతదేహం వైజాగ్ బీచ్ లో దొరుకుతుంది. కానీ 40 రోజులకు అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడని సీఐ రవి వర్మ కేసు క్లోజ్ చేస్తాడు. అప్పటికే డ్యూటీ నుండి సస్పెండ్ అయి ఉన్న ఏసిపి సత్య (సత్యదేవ) అనుకోకుండా ఆ కేసు వివరాలు చూసినప్పుడు కరెక్ట్ గా ఏడాది క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన తన భార్య పద్దు (రోషిణి ప్రకాష్) సూసైడ్ కి శ్రీనివాసు సూసైడ్ కి మధ్య ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇక అక్కడి నుండి డ్యూటీలో లేకపోయినా సత్య మిస్టరీ ని ఎలా చేయించాడు అనేదే కథ.
ప్లస్ పాయంట్స్
ఎప్పటిలాగే సత్య దేవ్ పర్ఫామెన్స్ ఇరగదీశాడు
రఘు కుంచె బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అత్యద్భుతం
మైనస్ పాయింట్స్
బోరింగ్ కథనం
ఆహా అనిపించే ఒక థ్రిల్ మొమెంట్ ఒక్కటి కూడా లేకపోవడం
సంబంధం లేకుండా వచ్చే పాటలు
బలం లేని కథ
పర్ఫామెన్స్ & టెక్నికల్ యాస్పెక్ట్స్
అటు ఎమోషన్ ఇటు సీరియస్ పోలీసుల్ రోల్ ని సత్యదేవ్ చాలా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్ క్లైమాక్స్ లో నెగటివ్ షేడ్ లో చేసిన పర్ఫామెన్స్ అదిరింది. హీరోయిన్స్ గా కనిపించిన పూజ జవేరి మరియు రోషిణి ప్రకాష్ ఫర్వాలేదనిపించే గా రవి వర్మ మరియు సత్య రాజ్ పాత్ర్రలకు ఇంకా ప్రాధాన్యత పెంచాల్సింది అనిపించింది.
టెక్నికల్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ను ముందు మెచ్చుకోవాలి. పాటలు అంతగా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు. అసలు కంటెంట్ సినిమాలో ఏదో ఉందనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం కష్టపడ్డాడు. జీకే ఫోటోగ్రఫీ చాలా బాగుంది. హీరోయిజం సీన్స్‌లో లైటింగ్, ఫ్రేమింగ్ కొత్తగా ఉంది మరియు 104 నిమిషాల సినిమా కూడా బోర్ కొట్టించే లా ఉన్న ఎడిటింగ్ లో కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
దర్శకుడి విషయానికి వస్తే స్క్రీన్ ప్లే పరంగా చాలా స్లోగా స్టార్ట్ అయి తరువాత పికప్ అందుకుంటుంది. సరే బాఉంది అనుకున్న కొద్ది సేపటికే డౌన్ అయి పూర్తయ్యే టైంకి నీరసం తెప్పిస్తుంది. ఇక డైరెక్టర్ గా విజువలైజేషన్ లో కొంతవరకూ బెటర్ అనిపించుకున్న ఆడియన్స్ ని హుక్ చేసి సినిమాని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అలాగే కొన్ని సీన్స్ లో అయితే మెచ్యూరిటీ కనిపించలేదు.
విశ్లేషణ
47 డేస్ అనేది ఒక మిస్టరీని రివీల్ చేసే థ్రిల్లర్ కథ అని టైటిల్ లోనే దర్శకుడు చెప్పాడు కానీ అందులో మిస్టరీ లేదు.. థ్రిల్ లేదు. కథ లేకపోయినా అబ్బురపరిచే మొమెంట్స్ తో మరియు ఉత్కంఠ రేకెత్తించే సీన్స్ తో ఏదైనా మ్యాజిక్ చేశారా అంటే అదీ జరగలేదు. ఓటిటి కోసం 104 సినిమాల రన్ టైమ్ ని తగ్గించినా సినిమా బోర్ కొట్టేస్తుంది అంటేనే విషయం అర్థం చేసుకోవచ్చు.
రేటింగ్: 2/5
కంక్లూజన్ : 47 రోజుల్లో సినిమా 47 నిమిషాలు అయినా చూడగలరా అన్నది డౌటే…