32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Mission Majnu Review: సిద్ధార్థ మల్హోత్ర, రష్మిక ‘మిషన్ మజ్ను’ సినిమా రివ్యూ..!!

Share

Mission Majnu Review: ఈ మధ్యే ‘మిషన్ మజ్ను’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావడం జరిగింది. భారత్, పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.

సినిమా: మిషన్ మజ్ను.
నటీనటులు: సిద్ధార్థ మల్హోత్ర, రష్మిక మందన, షరీబ్ హస్మీ, మిర్ సార్వర్, కుముద్ మిశ్రా తదితరులు.
సంగీతం: కేతన్ సోధ
దర్శకుడు: శంతను భాగ్చి
నిర్మాత: రొన్ని స్రీవల, అమర్ బుటల, గరిమ మెహత.
సినిమాటోగ్రఫీ: బిజిటేష్ దీ
ఓటిటి: నెట్ ఫ్లిక్స్.

Sidharth Malhotra and Rashmika Mandana Mission Majnu Review
Sidharth Malhotra and Rashmika Mandana
పరిచయం:-

కరోనా తర్వాత ఓటిటి కంటెంట్ కీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బాగా అలవాటు పడటం తెలిసిందే. థియేటర్ లలో సినిమాల కంటే ఓటిటి సినిమాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చాలామంది నిర్మాతలు వివిధ ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు ఓటిటినీ దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు భారీ ధర పలుకుతున్నాయి. ఈ తరహా లోనే ఓటిటిలో అధిక ధర పలికింది “మిషన్ మజ్ను”. వాస్తవానికి ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ అధిక ధర పెట్టి రైట్స్ కొనడం జరిగింది. ఫిక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో… గూడచారి పాత్రలో సిద్ధార్థ మల్హోత్రా నటించడం జరిగింది. అందురాలి పాత్రలో రష్మిక మందన నటించింది. మరి “మిస్టర్ మజ్ను” సినిమా ఎలా ఉందో చూద్దాం.

Sidharth Malhotra and Rashmika Mandana Mission Majnu Review
Sidharth Malhotra
స్టోరీ:-

భారత్ ప్రభుత్వం “లాఫింగ్ బుద్ధ” పేరుతో అణు పరీక్షలు పరీక్షించడం.. ప్రపంచ దేశాలతో పాటు పాకిస్తాన్ కి ఆగ్రహం కలిగిస్తది. దీంతో భారత్ కీ పోటీగా పాకిస్తాన్ న్యూక్లియర్ అణు బాంబును తయారు చేయడం స్టార్ట్ చేస్తది. అయితే పాకిస్తాన్ ఆ న్యూక్లియర్ బాంబు ప్రాజెక్ట్ ఎక్కడ తయారు చేస్తుందో ఎవరికి తెలియకుండా చాలా గోప్యంగా వ్యవహరిస్తది. అయితే పాక్ అణుబాంబు ప్రాజెక్టు ఎలాగైనా తెలుసుకోవడానికి భారత భద్రత దళాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తది. ఈ ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ లో న్యూక్లియర్ బాంబు ప్రాజెక్టు మొత్తం విషయాలు తెలుసుకోవడానికి భారత్ గూడచారి స్పై ఏజెంట్ ఆమన్ దీప్ అజిత్ పాల్ సింగ్ అలియాస్ తారిక్ (సిద్ధార్థ మల్హోత్రా)కి బాధ్యతలు అప్ప చెప్పడం జరుగుతుంది. తారిక్ జరిపే ఈ ఆపరేషన్ ని “మిషన్ మజ్ను”గా నామకరణం చేస్తారు. అయితే ఈ ఆపరేషన్ లో తారిక్ కీ పాకిస్తానీ అమ్మాయి నజ్రీన్(రష్మిక) ఎలా పరిచయమైంది..? రష్మిక మందన ద్వారా పాకిస్తాన్ లో తారిక్ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే.. “మిషన్ మజ్ను” సినిమా చూడాల్సిందే.

Sidharth Malhotra and Rashmika Mandana Mission Majnu Review
Mission Majnu Review
విశ్లేషణ:

భారత్ మరియు పాక్ మధ్య ఉన్న విద్వేషపూరిత వాతావరణాన్ని బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. ఒక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు సౌత్ లో కూడా.. భారత్, పాక్ మధ్య శత్రుత్వం ఆధారం చేసుకుని డజన్ల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో దేశభక్తి నేపథ్యంలో ఈ తరహా కంటెంట్ కలిగిన సినిమాలు చాలావరకు ఆకట్టుకున్నాయి. సరిగ్గా ఇదే తరహాలో “మిషన్ మజ్ను” సినిమా కథ ఉంటుంది. తారిక్ తండ్రి పై దేశద్రోహి అనే ముద్ర పడతది. దీంతో ఒకవైపు అవమానాలు వస్తూనే మరోవైపు దేశం కోసం పనిచేస్తూ తన తండ్రిపై పడిన దేశద్రోహి ముద్రను చెరిపేయడానికి గూడచారిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం జరుగుద్ది. ఆ తరహాలోనే ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ దేశం చేపట్టిన న్యూక్లియర్ బాంబ్ ప్రాజెక్ట్ కనిపెట్టడానికి… గూడచారిగా పాకిస్తాన్ లో అడుగుపెట్టడం జరుగుద్ది. ఆ తర్వాత పాక్ లో ఎవరికీ తనపై అనుమానం రాకుండా.. చాలా చక్కగా మేనేజ్ చేస్తాడు. పాకిస్తానీ అమ్మాయి అయినా నజ్రిన్ కి కళ్ళు కనిపించవు. ఎంతో మంచి అబ్బాయిగా అందరి చేత అనిపించుకున్న తారిక్…అదే సమయంలో నజ్రిన్ నీ పెళ్లాడి అందరి సానుభూతి పొందుతాడు. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుద్ది. “మిషన్ మజ్ను” చేపట్టి… పాకిస్తాన్ దేశం రహస్యంగా చేపట్టిన న్యూక్లియర్ బాంబు ప్లాంట్ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలుసుకోవడానికి.. చేసిన ప్రయత్నాలు చాలా ఆకట్టుకుంటాయి. ఒకపక్క మంచి కోణం చూపిస్తూనే మరోపక్క దేశం కోసం పోరాడే రీతిలో సిద్ధార్థ మల్హోత్రా… యాక్షన్ సన్నివేశాలలో చెలరేగిపోయాడు. ముఖ్యంగా ట్రైన్ లో జరిగే ఫైట్ హాలీవుడ్ స్టంట్ లనీ తలపిస్తది. పాకిస్తాన్ దేశంలోనే ఉంటూ.. ఆ రహస్య న్యూక్లియర్ బాంబు ప్లాంట్ సమాచారాన్ని.. భారత్ కీ చేరవేయడం చాలా హైలెట్ గా దర్శకుడు చూపించడం జరుగుతుంది. అయితే స్టోరీ మొత్తం హీరో చుట్టూ ఉండటంతో రష్మిక పాత్రకు పెద్ద స్కోప్ లేదు. హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తన పాత్రకి న్యాయం చేసింది. ఇంకా ఈ సినిమాలో రమణా సింగ్ అలియాస్ మౌలివిగా.. కుమ్మొద్దు మిశ్రా, అస్సలామ్ ఉస్మానియాగా షరీఫ్ హస్మి, రా ఆఫీసర్ గా జాకీర్ హుస్సేన్ తమన్నా తనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. సినిమాకి కేతన్ సోది సంగీతం బాగా ఆకట్టుకుంది. రెండు గంటలు నిడివి కలిగిన ఈ సినిమాలో.. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటువంటి సబ్జెక్టు కలిగిన సినిమాలు చాలా రావటంతో.. అంతగా చెప్పుకోవడానికి సినిమాలో కంటెంట్ లేదని చెప్పవచ్చు. అందువల్లే థియేటర్ లో విడుదల కావలసిన “మిషన్ మజ్ను” నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిందని చెప్పవచ్చు.

Sidharth Malhotra and Rashmika Mandana Mission Majnu Review
Sidharth Malhotra Mission Majnu Review
ప్లస్ పాయింట్స్:

సిద్ధార్థ మల్హోత్రా.
యాక్షన్స్ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ.
డైరెక్షన్.

మొత్తంగా: గూడచారి నేపథ్యంతో రొటీన్ స్టోరీ తరహాలో “మిషన్ మజ్ను”.
రేటింగ్: 3/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Share

Related posts

NTR: యంగ్ హీరో శ్రీ విష్ణు… ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్..!!

sekhar

“బాయ్ కాట్ లైగర్” పై తనదైన శైలిలో రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ..!!

sekhar

“అనసూయకు ఈ సినిమా‌కి అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా?” అంటూ షాక్ అవుతున్న యాంకర్స్!!

Naina