Mistake Review: చిన్న కధాంశం తీసుకుని నిర్మించిన సినిమా `మిస్టేక్`. `రామ్ అసుర్` చిత్రంతో ఓకే అనిపించుకున్న అభినవ్ సర్దార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తనే ఈ చిత్రాన్ని నిర్మించారు. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అజయ్ కతుర్‌వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. శుక్రవారం (అక్టోబర్ 13) నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా ఓటీటీ.
అసలు ఈ మిస్ఆ టేక్ సినిమా జనాలని ఎంగేజ్ చేసిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే.. ఒకే రూమ్ లో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్ కి వేరు వేరు సమస్యలు వచ్చి వాళ్ళని వారం రోజుల్లో చంపేస్తామని బెదిరింపులు వస్తాయి. దీంతో ఒక వారం రోజులు ఎక్కడికైనా కనపడకుండా వెళ్లిపోవాలని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలా ట్రిప్ కి మొదలయి మూడు జంటలు ఎంజాయ్ చేస్తుంటే ఓ వ్యక్తి(అభినవ్ సర్దార్) వీళ్ళని వెంబడిస్తాడు. ఇక అక్కడినుంచి సినిమా థ్రిల్లింగ్ గా సాగుతుంది . అగస్త్య(అజయ్ కథుర్వర్)- మిత్ర(ప్రియా), మహదేవ్ శర్మ(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) మూడు ప్రేమ జంటలు.

ఆరుగురు ఒకే కలర్ ప్యాంట్‌లు ధరిస్తారు. వాటిని కార్తిక్ ఆర్డర్ చేస్తాడు. రోడ్ మధ్యలో ఓ భయంకరమైన కిల్లర్(అభినవ్ సర్దార్) వీరిని వెంబడిస్తాడు. తుపాకితో కాల్చుతూ దాడి చేస్తుంటారు. అతన్నుంచి తప్పించుకునే క్రమంలో ఓ దట్టమైన అడవిలోకి పరిగెడతారు. అందులో అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఒక్కొక్కరుగా తమ ప్యాంట్లని వదిలేసుకుంటారు. ఆ దట్టమైన అడవిలో మరుగుజ్జు జాతి వ్యక్తులను కలుస్తారు. అక్కడ కాసేపు సరదాగా గడుపుతారు. కానీ చివరికి తమని వెంబడిస్తున్న కిల్లర్‌కి దొరికిపోతారు. అతన్ని ఎవరు పంపించారు? వీరిని ఎందుకు వెంబడిస్తున్నాడు? ఇంతకి అతనెవరు? ఈ ముగ్గురు లవర్స్ కి ప్రత్యర్థులతో జరిగిన గొడవలేంటి? ఒకే రకమైన కలర్ ప్యాంట్లలో ఏముంది? చివరికి వీరి కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.

చిన్న పాయింట్ మీద ఈ సినిమాని రెండు గంటలపాటు నడిపించిన తీరు బాగుంది. దాన్ని ఆసక్తి కలిగేలా తీసుకెళ్లిన తీరు చాలా బాగుంది. జనాల్ని ఆకట్టుకునేలా ఉంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా కథని నడిపించడం ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఆద్యంతం సస్పెన్స్ గా సాగుతూ, చివర్లో ట్విస్టులు రివీల్ అవుతున్న తీరు ఉత్కంఠకి గురి చేస్తాయి. ఎంగేజ్ చేస్తాయి.

చివరిలో వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. కానీ దానికున్న కారణం తేలిపోయింది. క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సింది. హాస్య సన్నివేశాలపై కూడా మరింత శ్రద్ద పెట్టాల్సింది. కామెడీకి ఇంకా అవకాశం ఉన్నా ఎందుకో మరి సరిగా వాడుకోలేకపోయారు. దీంతో అవి బలవంతపు కామెడీగా అనిపిస్తుంటాయి. చాలా సీన్లు తేలిపోయాయి. ఎంగేజ్ చేసే సీన్లు కూడా తేలిపోయాయి. కథని మరింత బలంగా రాసుకుంటే సినిమా ఫలితం ఇంకా బాగుండేది. ఈ లోపాల వల్ల సినిమా ఒక యావరేజ్ సినిమా గా అయిపొయింది. మొత్తానికి ఒకసారి చూడొచ్చు.