32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Veera Simha Reddy Review: టాలీవుడ్ సంక్రాంతి హీరో బాలకృష్ణ “వీరసింహారెడ్డి” మూవీ రివ్యూ..!!

Share

Veera Simha Reddy Review: 2023వ సంవత్సరం తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి సంక్రాంతి కానుకగా విడుదలైన మొట్టమొదటి పెద్ద హీరో సినిమా బాలకృష్ణ వీరసింహారెడ్డి.

సినిమా పేరు: వీరసింహారెడ్డి
దర్శకుడు: గోపీచంద్ మలినేని
నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, వరలక్ష్మి శరత్ కుమార్,దునియా విజయ్, హాని రోజ్, సప్తగిరి, నవీన్ చంద్ర, బీ.ఎస్ అవినాష్, పీ. రవికుమార్, అజయ్ ఘోష్, మురళి శర్మ, చంద్రిక రవి.
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.
సంగీతం: తమన్
విడుదల తేదీ: 12-01-2023

Tollywood Sankranti Champion Balakrishna Veera Simha Reddy Movie Review
పరిచయం:

వరుస పరాజయాలతో ఉన్న బాలకృష్ణ 2021లో “అఖండ”తో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య “వీరసింహారెడ్డి”తో కొనసాగిస్తున్నారు. గత ఏడాది బాలకృష్ణ నుండి ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ “అన్ స్టాపబుల్” షో ద్వారా యాంటీ అభిమానులకు సైతం నచ్చేలా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో తనకి కలిసొచ్చే సీజన్ సంక్రాంతి పండుగ కానుకగా “వీరసింహారెడ్డి”తో జనవరి 12వ తారీకు ఈరోజు ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది. కెరియర్ లో తనకి కలిసొచ్చిన ఫ్యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో “సింహ” టైటిల్ సెంటిమెంట్ తో “వీరసింహారెడ్డి” ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Tollywood Sankranti Champion Balakrishna Veera Simha Reddy Movie Review

స్టోరీ:-

 

“వీరసింహారెడ్డి” సినిమా అన్నాచెల్లెళ్ల మధ్య వైరానికి సంబంధించిన ఫ్యాక్షన్ డ్రాప్ కలిగిన కథాంశంతో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన స్టోరీ. కర్నూలు జిల్లాలో పులిచెర్ల ప్రాంతంలో అవినీతి అక్రమాలు మరియు పగా ప్రతీకారాలకు వ్యతిరేకంగా.. వీరసింహారెడ్డి (బాలకృష్ణ) అనే వ్యక్తి కత్తి పట్టడం జరుగుద్ది. ఈ క్రమంలో మరోపక్క సోదరీ భానుమతి (వరలక్ష్మి), ప్రతాపరెడ్డి (దునియా విజయ్) దంపతులతో గొడవ కొనసాగుతూ ఉంటది. బావ ప్రతాప్ రెడ్డి తనని చంపడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ… చెల్లెలపై ఉన్న ప్రేమ కారణంగా… వీరసింహారెడ్డి వదిలేస్తూ క్షమిస్తాడు. అయితే ఫ్యాక్షన్ గొడవల కారణంగా వీరసింహారెడ్డి భార్య మీనాక్షి (హనీ రోజ్), జై సింహారెడ్డి (బాలకృష్ణ) సీమకు దూరంగా ఇస్తాంబుల్ లో బతుకుతుంటారు. ఈ క్రమంలో భార్యాబిడ్డను చూడడానికి ఇస్తాంబుల్ వెళ్లిన “వీరసింహారెడ్డి” నీ ప్రత్యర్థులు విదేశాలలో మట్టుపెడతారు. చెల్లెలు కూడా పగ తీర్చుకునే తరహాలో వీరసింహారెడ్డి పై వ్యవహరించటం స్టోరీలో ట్వీస్ట్ గా మారుది. వీరసింహారెడ్డి చనిపోయిన తర్వాత కొడుకు జై సింహారెడ్డి ఏ విధంగా స్పందించాడు..? తన తండ్రిని చంపేసిన అతని ఏం చేశాడు అనేది తెరపై చూడాల్సిందే.

Tollywood Sankranti Champion Balakrishna Veera Simha Reddy Movie Review

విశ్లేషణ:

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి హీరోగా బాలకృష్ణకి మంచి సెంటిమెంట్ ఉంది. ఈ పండుగ ఆధారం చేసుకుని బాలకృష్ణ రిలీజ్ చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఆ తరహాలోనే “వీరసింహారెడ్డి” సంక్రాంతి బరిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి పెద్ద సినిమాగా పోటీకి దిగింది. ఇక సినిమా స్టార్ట్ అయ్యాక దాదాపు 20 నిమిషాల పాటు చాలా రొటీన్ గా సాగుద్ది. సినిమాలో ఎప్పుడైతే వీరసింహారెడ్డి పాత్ర ఎంటర్ అవుతుందో ఒక్కసారిగా… సినిమా గ్రాఫ్ పెరిగిపోద్ది. అక్కడినుండి స్టొరీపై ప్రేక్షకులకు మంచి ఇంట్రెస్ట్ కలుగుద్ది. వీర సింహారెడ్డి పాత్ర చాలా పవర్ ఫుల్ గా చూపించారు. గొడవలను ఆయన డీల్ చేసే విధానం… ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్..లో ఆయనకో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంది అన్న తరహాలో… సస్పెన్స్ గా స్టోరీ నడిపించారు. ఇక సెకండాఫ్ లో “వీరసింహారెడ్డి” చనిపోయాక.. ఫ్లాష్ బ్యాక్.. సిస్టర్ సెంటిమెంట్ చాలా బలమైన కథగా దర్శకుడు గోపీచంద్ మలినేని న్యాయం చేశారు. సెకండాఫ్ లో కుటుంబ కథ ప్రేక్షకులను అల్లరించే రీతిలో కథనాన్ని అద్భుతంగా నడిపించారు. ఇక సెంటిమెంట్ సన్నివేశాలలో బాలయ్య తన నటనతో మరోసారి విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో రెండు పాత్రలతో బాలకృష్ణ వన్ మాన్ ఆర్మీ తరహాలో… దాదాపు మొత్తం బరువు తానే మోసాడు. వీర సింహారెడ్డి, జై సింహా రెడ్డి పాత్రకి తగ్గట్టు పోటీగా వరలక్ష్మీ నటన సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. క్రాక్ సినిమాలో ఏ రీతిగా వరలక్ష్మిని వాడాడో… అదే తరహాలో ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ నెగిటివ్ పాత్రలో దర్శకుడు గోపీచంద్ వాడటం జరిగింది. నట సింహం నందమూరి బాలయ్యతో నువ్వా నేనా అన్నట్టుగా వరలక్ష్మి నటన స్క్రీన్ పై కనబడింది. వరలక్ష్మి భర్తగా మరో విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ నటన కూడా హైలెట్. ఈ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో క్రూరమైన విలన్ దునియా విజయ్ రూపంలో దొరికారని చెప్పవచ్చు. ఇక సినిమాలో దునియా విజయ్ తండ్రి పాత్ర కూడా… చాలా క్రూరత్వంగా చూపించారు. ఇక అన్నిటికీ మించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మరోసారి బాలకృష్ణ సినిమాలకు తన పవర్ ఏంటో చూపించాడు. చాలా ఇంటర్వ్యూలలో బాలయ్య సినిమా అంటే తనకి స్పెషల్ అని తెలియజేశారు. ఆ తరహాలోనే అఖండాలో అదరగొట్టే మ్యూజిక్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు “వీరసింహారెడ్డి”కి అదే రీతిలో… బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటం జరిగింది. మరోసారి తన మ్యూజిక్ తో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాలో ఎక్కడ ఏ సన్నివేశం ఉండాలో.. అంతే మోతాదులో చూపించారు. ఓవర్ గా బాలకృష్ణ అని ఎక్కడా కూడా చూపించకుండా.. కథకు తగ్గ హీరోయిజాన్ని బాలకృష్ణ ద్వారా రాబట్టారు. ఇక సినిమాలో వైయస్ జగన్ ప్రభుత్వం పై సెటైర్లు వేసినట్లు ముఖ్యంగా కంపెనీలు రాష్ట్రం నుండి వెళ్ళిపోతున్నాట్టు వంటి వాటిని చూపించినట్లు .. కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. హీరోయిన్ శృతిహాసన్ పాత్ర మాత్రం పెద్దగా.. కనెక్ట్ కాలేదు. ఏదో నామ్ కే వాస్తు తరహాలో ఆమె పాత్ర ఉంది.

Tollywood Sankranti Champion Balakrishna Veera Simha Reddy Movie Review

ప్లస్ పాయింట్స్:

వీరసింహారెడ్డి పాత్ర.
తమన్ BGM.
ఇంటర్వెల్ బ్లాగ్.

 

మైనస్ పాయింట్స్:

ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు.
ఫైట్స్.
శృతిహాసన్.
సెకండాఫ్.

 

ఓవరాల్: “వీరసింహారెడ్డి’ తో మరోసారి సంక్రాంతి సీజన్ తనదే అని నిరూపించుకున్న బాలయ్య బాబు.

 

రేటింగ్: 3.5/5

Share

Related posts

వైరల్ ఫోటో.. పొలం పనులు చేస్తున్న బిగ్ బాస్ దివి..!

Teja

Anil Ravipudi: మిగిలింది ఆ ఇద్దరు హీరోలే అంటున్న అనిల్ రావిపూడి.. కోరిక నెర‌వేరేనా?

kavya N

వర్మ తర్వాత సినిమా ఏంటో చూడండి…! ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశాడు..!

sekhar