Tuck Jagadish : నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా అతని తర్వాత సినిమా అయిన ‘టక్ జగదీష్’ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ రోజు విడుదలయింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఆదరించే నాని ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న లీడ్ క్యారెక్టర్ తో పాటు మాస్ హీరోగా కూడా కనపడనున్నాడు.
ఈ టీజర్ ద్వారా సినిమాకు సంబంధించిన అన్నీ కీలక పాత్రలను చిత్ర యూనిట్ ప్రవేశపెట్టారు. ప్రధాన పాత్రలో జగపతిబాబు ఈ సినిమాలో నాని కి అన్నగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నాని కుటుంబ సభ్యులుగా నాసర్, రావు రమేష్, రోహిణి, ఐశ్వర్య రాజేష్ కనిపించబోతున్నారు. ఐశ్వర్య రాజేష్ నాని మర్దలు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే టీజర్ మొత్తంలో ఒక పాట ప్లే అవుతూ ఉంటుంది. ఎస్.ఎస్ తమన్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రంలో ఈ పాట చాలా బాగుంది.
మొత్తంగా టీజర్ ద్వారా నానికి అతని కుటుంబం పైన ఉండే ప్రేమ, అభిమానం అలాగే అతని కుటుంబం అతనిని చూసుకునే విధానం చూపించారు. నాని సరసన ఈ సినిమాలో రితూ వర్మ కథానాయికగా నటిస్తోంది. అయితే శివ నిర్వాణ ముందు సినిమా లతో పోలిస్తే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. నానికి కూడా ఇది కొత్త మేక్ ఓవర్ అనే చెప్పాలి.
హెవీ ఫైట్ సీక్వెన్స్ లు నాని సినిమాలో తొలిసారి చూడబోతున్నాం. ప్రసాద్ మురెళ్ళ ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమా గ్రామీణ వ్యవసాయ నేపథ్యంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళంలో మంచి నటుడిగా పేరొందిన డానియల్ బాలాజీ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అతడి క్యారెక్టర్ కూడా టీజర్లో ఎంతో ఆసక్తికరంగా కనిపించింది. మరి తొలిసారి ఫ్యామిలీ– మాస్ మసాలా మిక్స్ చేస్తున్న నాని హిట్ కొడతాడేమో చూడాలి..!
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!