NewsOrbit
రివ్యూలు సినిమా

రివ్యూ : నాని V – వీ సినిమా

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఏ ఒక్క పేరు మోసిన సినిమా రిలీజ్ లేకుండా చాలా చప్పగా గడిచిపోయిన క్షణాలకు ఇక తెరపడింది. సుధీర్ బాబు, నాని నాయకప్రతినాయక పాత్రల్లో…. విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నివేథా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘V’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….

 

Nani's V to have a direct OTT release soon? | Telugu Movie News - Times of India

కథ

డిసిపి విక్రమాదిత్య (సుధీర్ బాబు) హైదరాబాద్ లోనే ఎంతో పేరుమోసిన పోలీస్ ఆఫీసర్. అయితే సిటీ లో ఉన్న క్రిమినల్స్ ఆట కట్టిస్తున్న ఆదిత్య కు ఒక పోలీస్ ఆఫీసర్ హత్యతో అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. హత్యచేసింది మన విలన్ విష్ణు (నాని). ఇక ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపినప్పుడేనాకు నువ్వే కావాలిఅని ఆదిత్యను ఉద్దేశించి నాని అక్కడ ఒక నోట్ ను ఉంచుతాడు. ఆ తర్వాత డిసిపి ఆదిత్య ప్రెస్ మీట్ పెట్టి మరీ వాడెవడో నన్ను ఛాలెంజ్ చేసి చాలా తప్పు చేశాడు అని విష్ణు కి సవాల్ విసురుతాడు. అతనిని త్వరలోనే పట్టుకుంటాను అని చెప్పినప్పుడు విష్ణుఆదిత్య కు ఫోన్ చేసి మొత్తం ఐదు మర్డర్లు చేస్తానని…. ఇక నాలుగు మిగిలి ఉన్నాయని…. వీలైతే తనను పట్టుకునేందుకు ట్రై చేయమని చెబుతాడు. మొత్తానికి విష్ణు తన ఇంటెలిజెన్స్ తో ఐదు హత్యలు చేశాడా? లేదా చేసే లోపు ఆదిత్యవిష్ణు ని పట్టేసుకున్నాడా..? అన్నదే కథ.

Nani's V Gets Biggest OTT Deal Of His Career?

 

మైనస్ పాయింట్స్

ప్రతినాయకుడి పాత్రలో నాని ఇమడలేకపోయాడు

ఆర్మీ ఎపిసోడ్స్ లాజిక్ లేకుండా ఉన్నాయి

అదితి, నివేత క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదు

ప్లస్ పాయింట్స్

క్లైమాక్స్ లో నాని పర్ఫార్మెన్స్

కొద్దిగా పండిన సెంటిమెంట్

V The Movie (2020) - 9by10

 

విశ్లేషణ

ఇంద్రగంటి మోహన్ కృష్ణ వంటి విలక్షణ దర్శకుడి నుండి నాని ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న సినిమా వస్తుంది అంటే అంచనాలు బాగానే ఉంటాయి. అందుకు తగ్గట్టు మ్యాచో పర్సనాలిటీ గా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు హీరో. పైగా పోలీస్ ఆఫీసర్సీరియల్ కిల్లర్ కథాంశం. అయితే పేరుకే ‘V’ ఒక థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులో థ్రిల్లర్ ఎలిమెంట్ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. సీరియల్ కిల్లర్ గా నాని చేసే మర్డర్లు అస్సలు ఆసక్తికరంగా లేవు. స్టోరీ అంతా చాలా చప్పగా వెళ్లిపోతుంది. ఎక్కడా ప్రేక్షకులకు హై మొమెంట్స్ కూడా లేవు. నాని, సుధీర్ బాబు మంచి యాక్టర్లు అయినప్పటికీ వారికి ఇచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేయలేకపోయారు అనే చెప్పాలి. నానిని అసలు ఆ ప్రతినాయకుడి పాత్రలో స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఊహించలేము. సెంటిమెంట్ కొద్దిగా వర్క్ ఔట్ అయినప్పటికీ నాని చేసే హత్యల్లో కనీస పస లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి.

Release of Nani starrer V delayed due to coronavirus outbreak | Entertainment News,The Indian Express

కంక్లూజన్

థియేటర్లలో ‘V’ బొమ్మ గనుక పడుంటే ఖచ్చితంగా ఫ్లాప్ టాక్ మూటగట్టుకునేది. దిల్ రాజు తక్కువ లాభానికి అమ్మినా…. చాలా తెలివిగా తప్పించుకున్నాడు అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే…. ఇప్పటివరకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీసిన చిత్రాలలో ‘V’ చిత్రమే ది వరస్ట్.

న్యూస్ ఆర్బిట్ రేటింగ్ : 2/5

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri