NewsOrbit
Cinema OTT రివ్యూలు సినిమా

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

Valari Movie Review: గురు మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రితిక సింగ్‌, శ్రీరామ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం వ‌ళ‌రి. హారర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించారు. సుబ్బరాజు, ఉత్తేజ్, సహస్ర, పరిణిత త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. వర్చువల్ ప్రొడెక్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన వ‌ళ‌రి సినిమాకు విష్ణు సంగీతం అందించారు. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ చిత్రాల‌కు మంచి ఆధ‌ర‌ణ ల‌భిస్తున్న నేప‌థ్యంలో వ‌ళ‌రి మూవీని నేరుగా మార్చి 6న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేశారు. ప్ర‌స్తుతం ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ: నవీన్ (శ్రీరామ్) నేవీలో కెప్టెన్. అత‌ని భార్య పేరు దివ్య (రితికా సింగ్). ఈ జంట‌కు మ‌ధు అనే ఓ కుమారుడు ఉంటారు. ఉద్యోగరీత్యా నవీన్ కుటుంబం కృష్ణపట్నం వస్తుంది. మొదట్లో ప్రభుత్వ క్వార్టర్‌లో నివాసం ఉంటున్న వారు తర్వాత వెంకటాపురం బంగ్లాకు మారాతారు. ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని అక్కడివాళ్లు బ‌లంగా న‌మ్ముతారు. అదే స‌మ‌యంలో ఓ పదమూడేళ్ల అమ్మాయి తల్లిదండ్రులను చంపినట్టు దివ్యకు తరచూ కల వస్తుంటుంది. మ‌రోవైపు వారి ఇంట్లో అనూహ్యమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. దాంతో ఆ బంగ్లా గురించి తెలుసుకోవాల‌ని దివ్య భావిస్తుంది. ఈ క్ర‌మంలో ఆమెకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి..? అస‌లు ఆ బంగ్లా వెనుక క‌థ ఏంటి..? దివ్య కలకు, వెంకటాపురం బంగ్లాకు ఏమైనా లింక్ ఉందా..? వళరి అనే ఆయుధానికీ దివ్యకి ఉన్న సంబంధం ఏంటి..? వంటి విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ‌: వళ‌రి అనేది హార‌ర్‌ సినిమా అన‌డం కంటే ఎమోషనల్ రివెంజ్ డ్రామా అని చెప్ప‌డ‌మే క‌రెక్ట్‌. ట్రీట్‌మెంట్ మారినా హారర్ థ్రిల్లర్‌లు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. వ‌ళ‌రి కూడా అందుకు మినహాయింపు కాదు. రొటీన్ హారర్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో ఈ మూవీని కూడా తీశారు. అయితే నేటి త‌రం స్త్రీలకు సంబంధించిన కొన్ని సామాజిక అంశాలను ప్రదర్శించడం ద్వారా దర్శకురాలు సంతోషిణి ఈ చిత్రానికి ఎడ్జ్ ఇచ్చారు. దర్శకురాలు మహిళ కావడంతో మహిళల కష్టాలను ఎత్తిచూపారు. నేటి ప్రపంచంలో వారు ఎలా వేధింపులకు గురవుతున్నారో గ్రిప్పింగ్‌గా చూపించారు.

ప్రెగ్నెన్సీ స్కార్‌కి సంబంధించిన సీన్, పల్లెటూరిలో కామంతో నిండిన వ్యక్తికి కర్రసాముతో సమాధానం చెప్పిన మహిళ వీరత్వం వంటి సన్నివేశాలను చాలా చక్కగా చూపించారు. ఎమోషనల్ సీన్స్, దివ్య తల్లికి సంబంధించిన యాక్షన్ సీన్స్ ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి. కానీ బీభ‌త్సంగా భ‌య‌పెట్టే స‌న్నివేశాలైతే సినిమాలు ఏమీ ఉండ‌వు. క‌థ‌లో వ‌చ్చే ట్విస్టులు, హార‌ర్ థ్రిల్లింగ్ అంశాలు ఊహించదగినవిగా ఉంటాయి. మనిషిని క‌ర్మ‌ ఆ విధంగా వెంటాడుతుందని చెప్పడం దర్శకురాలి ఉద్దేశం. పాయింట్ బాగానే ఉన్నా.. ఎంచుకున్న నేప‌థ్యాన్ని స‌రైన రీతిలో ఆవిష్కరించలేకపోయారు. దాంతో వళరి రొటీన్ క‌థ‌ల జాబితాలో చేరింది. రుద్రగా సుబ్బరాజు నటన బావుంది. ఉత్తేజ్ పాత్రకు చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఏదేంటో సినిమాలోనే చూడాలి.

ప్ల‌స్‌లు-మైన‌స్‌లు: రితికా సింగ్ న‌ట‌న సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది. త‌ల్లీకూతుళ్లుగా ద్విపాత్రాభిన‌యం చేసి అద‌ర‌గొట్టింది. నటనలో వేరియేషన్స్ చూపించి ఆక‌ట్టుకుంది. శ్రీరామ్ నవీన్ పాత్రకు అద్భుతంగా యాప్ట్ అయ్యారు. విష్ణు నేపథ్య సంగీతం అల‌రించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగా మెప్పిస్తుంది. ఇక కొత్త‌ద‌నం లేని క‌థ‌క‌థ‌నాలు, వళరి అనే ఆయుధానికి స‌రైన ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం, కొన్ని స‌న్నివేశాల్లో లాజిక్ మిస్ అవ్వ‌డం, భ‌య‌పెట్టే అంశాలు పెద్ద‌గా లేక‌పోవ‌డం వంటివి సినిమాకు మైన‌స్‌లుగా మారాయి. ఫైన‌ల్ గా.. భారీ అంచ‌నాల‌తో చూస్తే వ‌ళ‌రి ఖ‌చ్చితంగా నిరాశ‌ప‌రుస్తుంది.

రేటింగ్‌: 2.5/5

author avatar
kavya N

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!

Saranya Koduri

Jamuna: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో గొడవలు పెట్టుకున్న జమున.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: ఆద్య లేటెస్ట్ ఫోటోస్ ను చూశారా?.. అందమంటే ఇది కదా…!

Saranya Koduri