NewsOrbit
రివ్యూలు

Valimai : వలీమై రివ్యూ

Valimai : అజిత్ నుండి సినిమా వస్తోందంటే తమిళనాడులో ఉండే సందడే వేరు. ఇక తెలుగులోనూ అజిత్ కు ఫ్యాన్స్ భారీ సంఖ్యలోనే ఉన్నారు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన వలీమై మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

valimai-review
valimai review

Valimai : కథ:

నగరంలో వరసగా దోపీడీలు ఎక్కువవుతాయి. దాంతో పాటు మర్డర్ ల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుంటారు. ఎవరు, ఎలా చేస్తున్నారో ఎవరికీ తెలీదు. అలాంటి సమయంలో ఏసీపీ అర్జున్ (అజిత్) ఛార్జ్ తీసుకుంటాడు. సైతాన్ స్లేవ్స్ అనే గ్యాంగ్, టెక్నాలజీ సాయంతో ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాలు లేని యూత్ ను ఒక చోట చేర్చి కార్తికేయ ఇదంతా చేయిస్తుంటాడు.

మరి ఏసీపీ, కార్తికేయ క్రైమ్స్ ను ఎలా బయటపెట్టాడు. ఈ కేసుని సాల్వ్ చేయడం ద్వారా ఏం సాధించాడు అన్నది మిగతా కథ.

valimai-review
valimai review

పెర్ఫార్మన్స్:

అజిత్ సూపర్బ్ నటుడు అన్నది అందరికీ తెల్సిందే. నటన పరంగా ఎప్పుడూ సర్ప్రైజ్ చేసే అజిత్ ఈసారి కూడా బైక్ సీక్వెన్స్ లు, ఛేజ్ స్టంట్ లు, వంటి వాటితో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు. వలీమైలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి ఇవే. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే బైక్ ఛేజ్ సీక్వెన్స్ ను కళ్లప్పగించి చూస్తాం. ఇక బస్ – హైవే ఫైట్ సీన్ కూడా అదిరిపోయింది. ఫైట్స్ లో అదరగొట్టిన అజిత్, ఎమోషనల్ సీన్స్ లో కూడా వావ్ అనిపించాడు.

తమిళ్ లో ఈ చిత్రం ద్వారా డెబ్యూ చేసిన కార్తికేయ ఇంప్రెస్ చేస్తాడు. చాలా స్టైలిష్ గా ఉంటుంది తన పాత్ర. అయితే అజిత్ ఇమేజ్ కు కార్తికేయ ఇమేజ్ సరిపోలేదని చెప్పాలి. అందుకే హీరో -విలన్ బ్యాలెన్స్ కొంత తప్పింది. హ్యూమా ఖురేషి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రాజ్ అయ్యప్ప కూడా అంతే. ఎమోషనల్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు.

valimai-review
valimai review

సాంకేతిక వర్గం:

హెచ్ వినోద్ ఖాకీ వంటి చిత్రాలతో అందరినీ మెప్పించాడు. అయితే వలీమైలో తనలోని రచయితకు బ్యాక్ సీట్ ఇచ్చాడు. పూర్తిగా అజిత్ ఇమేజ్ మీద డిపెండ్ అయ్యాడు. స్టైలిష్ టేకింగ్ వరకూ మెప్పించాడు కానీ కీలకమైన చోట్ల రచయితగా ఫెయిల్ అయ్యాడు. అందుకే కథను చెప్పాల్సిన సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు. దీంతో వలీమై సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.

దిలీప్ సుబ్బరాయణ్ అండ్ టీమ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమాలోని ఫైట్ సీక్వెన్స్ లు, ఛేజ్ సీక్వెన్స్ లు నిజంగా సూపర్బ్. వీటికోసమైనా సినిమాకు వెళ్లిపోవచ్చు అన్న రీతిలో ఉన్నాయి. అలాగే నిరవ్ షా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అదిరింది. కొన్ని షాట్స్ ను చాలా స్టైలిష్ గా కంపోజ్ చేసాడు. ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా ఉంది. అవసరమైన చోట ఫాస్ట్ కట్స్ తో యాక్షన్ ఫీల్ తెప్పించాడు.

యువన్ శంకర్ రాజా సాంగ్స్ గురించి చెప్పడానికేం లేదు కానీ ఘిబ్రన్ తో కలిసి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది.

valimai-review
valimai review
చివరిగా:

ఫస్ట్ హాఫ్ తోనే వలీమై టికెట్ డబ్బులకు గిట్టుబాటు చేసిందా అనిపిస్తుంది. అయితే కీలకమైన సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా మెరుపులు తప్ప పెద్దగా ఏం లేదు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే అప్పటివరకూ ఉన్న ఫీల్ ను పూర్తిగా నీరుగార్చేస్తాయి. యాక్షన్ ప్రియులకు, అజిత్ ఫ్యాన్స్ కు నచ్చే వలీమై సాధారణ ప్రేక్షకులకు ఓ మోస్తరుగా అనిపిస్తుంది.

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar