న్యూస్ రివ్యూలు సినిమా

Master Review : విజయ్ “మాస్టర్” రివ్యూ..!!

Share

Master Review : తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “మాస్టర్” సినిమా రిలీజ్ అయింది. గతంలో నగరం, ఖైదీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న డైరెక్టర్ కనకరాజ్ ఈ సినిమా తెరకెక్కించడం తో అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. తమిళంలో అదే విధంగా తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం…

Master review and release LIVE UPDATES: Vijay film opens to a positive response | Entertainment News,The Indian Expressస్టోరీ:

సినిమాలో జెడి పాత్రలో హీరో విజయ్ నటించారు. జె.డి మందుకి బానిస కాగా వారి ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తూ కాలేజీకి తప్ప తాగి వస్తుంటాడు. అతని మాటలకి, వ్యక్తిత్వానికి కాలేజీలో మంచి ఫాలోయింగ్ స్టూడెంట్స్ లో ఉండేది. ఈ క్రమంలో విజయ్ స్టైల్ తో పాటు అతను మాట్లాడే మాటలకు కాలేజీ లో లేదీ లెక్చరర్ గా పనిచేసే మాళవిక మోహనన్ లవ్ లో పడుతుండది. ఈ క్రమంలో విజయ్ కొన్ని అనివార్య కారణాల వల్ల జువెనైల్ స్కూల్ (బాల నేరస్తుల స్కూల్)కి ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఈ క్రమంలో భవాని(విజయ్ సేతుపతి) బాల నేరస్థుల స్కూల్ పిల్లల్ని ఉపయోగించుకుని తన స్వార్థం కోసం క్రైమ్స్ చేయిస్తూ ఒక క్రిమినల్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఉంటాడు. ఈ క్రమంలో మాస్టర్ గా పెట్టిన విజయ్ కి – భవాని కి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బాల నేరస్థుల స్కూల్ లో నేర ప్రవర్తన కలిగిన విద్యార్థులలో విజయ్ ఏ విధమైన మార్పు తీసుకువచ్చాడు…. అలాగే ఆ ఏరియాలో భవాని గ్యాంగ్ ఆగడాలను ఎలా ఆపాడు..? చివరాకరికి భవాని ని ఎలా మట్టు పెట్టాడు అన్నదే సినిమా స్టోరీ.

Master Movie: Review, Cast, Plot, Music, Box Office – All You Need To Know About Thalapathy Vijay, Malavika Mohanan, Vijay Sethupathi's Film!విశ్లేషణ :

సినిమా చూస్తున్నంత సేపు విజయ్ – విజయ్ సేతుపతి యాక్టింగ్ నువ్వా నేనా అన్నట్టు గా ఉంటాయి. అభిమానులు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఇద్దరూ మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. తాగుబోతుగా విజయ్ ఎంతో స్టైలిష్ గా నటించడమే కాక మాస్ పెర్ఫార్మెన్స్ తో పాటుగా చిన్న చిన్న సన్నివేశాలలో కూడా భావోద్వేగాన్ని కలిగేలా యాక్టింగ్ తో అలరించాడు అని చెప్పవచ్చు. ఇక విలన్ క్యారెక్టర్ లో నటించిన విజయ్ సేతుపతి.. వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ తో తనలో ఉన్న క్రూరమైన విలన్ నీ బయట పెట్టడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే హీరో విజయ్ కంటే విజయ్ సేతుపతి యాక్షన్ సూపర్ అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. మరోపక్క సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ కొద్దిసేపు ఉన్నాగాని… తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో పర్వాలేదనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ 100% న్యాయం సినిమాకి చేశాడు. సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో కొద్దిగా అక్కడ అక్కడ బోరింగ్ అని అనిపించే సమయంలో అనిరుధ్ ఏదో విధంగా సినిమా పైకి లేపాలని శతవిధాల చేసిన ప్రయత్నాలు ఆడియన్స్ కి నప్పుతాయి.

Vijay's master review, Vijay master movie review, Master review, Master movie reviewసినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ స్టోరీ కి తగ్గ విధంగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఆర్టిస్టులను చూపించడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అంతకుముందు నగరం, ఖైదీ సినిమా లు బ్లాక్ బస్టర్లు కావడం, పూర్తిగా డిఫరెంట్ స్టోరీలు కావడంతో మాస్టర్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడినా….. వాటిని అందుకోలేకపోయారు అని చెప్పవచ్చు. సింపుల్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా కూడా…. తెర మీద దాన్ని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే తరహాలో లోకేష్ కనకరాజ్ చూపించలేకపోయారు అనే టాక్ వినబడుతోంది. సినిమా చూసిన ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్ పరవాలేధనిపించినా…. సెకండాఫ్ మాత్రం చాలా చాలా బోర్..అనే కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ స్టోరీని సాగదీసి దాదాపు 3 గంటల సేపు ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను సినిమా హాల్లో కూర్చో పెట్టినట్లు ఉంది. డైరెక్టర్ గా లోకేష్ కనకరాజు మాస్టార్ విషయంలో భారీగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

సినిమా పాజిటివ్స్:

– విజయ్ పెర్ఫార్మన్స్
– విజయ్ సేతుపతి మైండ్ బ్లోయింగ్ డార్క్ క్యారెక్టరైజేషన్
– అనిరుధ్ మ్యూజిక్
– ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్
– సత్యన్ సూర్యన్ విజువల్స్

సినిమా నెగిటివ్స్:

– తెలిసిన కథ
– కథనంలో మ్యాజిక్ లేకపోవడం
– నేరేషన్ స్లోగా ఉండడం
– బాబోయ్ అనిపించే సెకండాఫ్
– సాగదీసి వదిలే రన్ టైం
– ఎఫెక్టివ్ గా లేని ఎడిటింగ్

రిజల్ట్ :

లోకేష్ కనకరాజు చేసిన గత రెండు సినిమాలైన ‘నగరం’, ‘ఖైదీ’ లను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ కి వెళితే అంతగా ఏమీ అనిపించదు. ఖచ్చితంగా నిరాశ చెందుతారు. సినిమా ఫుల్ లెన్త్ 3 గంటలు ఉండటం మరింత బోర్ అనిపిస్తుంది. కేవలం విజయ్ యాక్టింగ్, స్టైల్, మేనరిజం అదే విధంగా విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ కోసం అన్నట్టు మాస్టర్ చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ అయితే ప్రేక్షకుడు ఓపికకు పరీక్ష. ఓవరాల్ గా ‘మాస్టర్ – డిజాస్టర్’ అనే చెప్పాలి.


Share

Related posts

కోస్తాలో మూడు రోజులు వర్షాలు

somaraju sharma

Varun tej: బాబాయ్ వలనే వెనక్కి తగ్గాను.. లేదంటే బరిలో దిగి కుమ్మేసేవాడిని: వరుణ్ తేజ్

Ram

OTT: OTT ఛార్జెస్ తడిసి మోపెడవుతుందా? అయితే జియోలో ఈ ప్లాన్ ట్రై చేయండి.!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar