Wild Dog Review : ‘వైల్డ్ డాగ్’ మూవీ రివ్యూ 

Wild Dog Review : ‘వైల్డ్ డాగ్’ మూవీ రివ్యూ 
Share

Wild Dog Review : అక్కినేని నాగార్జున హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ పేరుతో తెరకెక్కిన చిత్రంవైల్డ్ డాగ్‘. అషిషోర్ సాల్మన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. తమన్ బాణీలు సమకూర్చారు. ఇక ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

 

Wild Dog Review movie nagarjuna
Wild-Dog-Movie-Review

Wild Dog Review : కథ

2006లో పూణే, హైదరాబాద్ లో జరిగిన వరుస బాంబు బ్లాస్ట్ లు…. ఆ తర్వాత గోకుల్ చాట్ (హైదరాబాద్) దగ్గర జరిగిన జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలోవైల్డ్ డాగ్చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ దారుణానికి పాల్పడిన టెర్రరిస్టులు పట్టుకునేందుకు హోమ్ డిపార్ట్ మెంట్ ఎన్ఐఏ ఆఫీసర్ విజయ వర్మ (నాగార్జున) ను నియమిస్తుంది. అతనికి ఉండే మరొక పేరువైల్డ్ డాగ్‘. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారుఎంతటి క్రూరమైన టెర్రరిస్టుల తో పోరాడవలసి వచ్చిందిచివరికి ఆ దాడికి పాల్పడిన వారిని సజీవంగా పట్టుకున్నారా లేదా అనేదే ఈ చిత్ర కథ.

Wild Dog Review : ‘వైల్డ్ డాగ్’ మూవీ రివ్యూ 
Wild Dog Review

పాజిటివ్ లు

  • నాగార్జున ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ వయసులో కూడా యాక్షన్ సీక్వెన్స్ లో ఎలాంటి తడబాటు లేకుండా ఒక స్పెషల్ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. అక్కినేని అభిమానులునాగార్జునను ఇలాంటి పాత్రలో ఇప్పటి ఊహించుకొని ఉండరు.
  • వైల్డ్ డాగ్కథ అది జరిగిన నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రియాలిటీకి దగ్గరగా ఉన్న కథను దర్శకుడు చాలా బాగా ప్రేక్షకులకు చిత్రీకరించి చూపించారు.
  • సినిమాలో రెండవ అర్థభాగం మంచి ఫ్లో తో సాగుతుంది. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ జరిగే సమయంలో కొన్ని సీన్లు స్లో గా వెళ్లి ప్రేక్షకులకు బోర్ కలిగిస్తాయి. అయితే ఈ విషయంలో మాత్రం దర్శకుడు జాగ్రత్తపడి రెండవ భాగం ఎక్కడా బోర్ కొట్టించలేదు.
  • ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా క్లిక్ అయ్యాయి. నాగార్జున టీం కి టెర్రరిస్టులకి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు తెరపైన చాలా బాగా వచ్చాయి.

మైనస్ లు

  • కథ లోకి ఎంటర్ అయ్యేందుకు ఈ చిత్రం చాలా సమయం తీసుకుంటుంది. అప్పుడు కూడా చాలా స్లోగా సాగుతుంది. దీనివల్ల ప్రేక్షకులకు మొదటి నుండి ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ కలగదు.
  • సినిమా మొదటి అర్ధ భాగం ఒకే అనిపిస్తుంది. అందులో కూడా మంచి మంచి సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుండేది. కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ముందు భాగం అంతా సాగదీసినట్లు అనిపిస్తుంది.
  • ఇక యాక్షన్ థ్రిల్లర్ పేరుతో వచ్చిన ఈ సినిమాలో అబ్బుర పరిచే సన్నివేశాలు కనీసం కూడా లేవు. సినిమా చాలా ఫ్లాట్ గా నడుస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అసలకే లేవు. ప్రేక్షకులకు భారీ హై ఇచ్చే మొమెంట్ ఒక్కటీ లేకపోవడం అతి పెద్ద మైనస్.
  • కథను ప్రేక్షకులకు చెప్పే విధానం, ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనపడింది. ఎంతో ఇంటరెస్టింగ్ గా ప్రజెంట్ చేయవలసిన బలమైన కథను దర్శకుడు చాలా సాదాసీదాగా చెప్పేసాడు. దీనివల్ల రెండవ అర్ధ భాగంలో చాలా ఫాస్ట్ గా జరిగే సన్నివేశాలు తో కూడా ప్రేక్షకులకు ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ కలగదు.
Wild Dog Review
Wild Dog Review

Wild Dog Review : విశ్లేషణ

వైల్డ్ డాగ్చిత్రానికి అక్కినేని నాగార్జున పడ్డ కష్టం తెరపై పూర్తిగా కనిపిస్తుంది. అలాగే రియాలిటీకి దగ్గరగా ఉండే కథలు కూడా సినిమాకు ప్లస్ పాయింట్. కానీ స్క్రీన్ ప్లే విషయం,లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించడంలో దర్శకుడు మరింత పరిణితి కనబరచవలసింది. మంచి సమర్థత ఉన్న కథను దర్శకుడు తన ఫ్లాట్ నరేష్ తో నిర్వీర్యం చేశాడు అని చెప్పాలి. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి కానీ దాని నుండి ఫీలింగ్ మాత్రం పెద్దగా కలగదు. ఇలా టెర్రరిస్టులు, దేశభక్తి, యాక్షన్ సన్నివేశాలు అంటే ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఒక సారి చూడవచ్చు.

చివరి మాట : నాట్ సోవైల్డ్డాగ్


Share

Related posts

Ys Jagan Mohan Reddy : రాజధాని విశాఖ విషయంలో జగన్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్..??

sekhar

Daily Horoscope జూలై 11 శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

Ap High court: బ్రేకింగ్ .. “సంగం” కేసులో టీడీపీ నేత దూళిపాళకు బెయిల్ మంజూరు

somaraju sharma