ముంబైలో బాలీవుడ్ బ్యూటీతో రౌడీ బాయ్ హల్చల్…

01 Mar, 2020 - 04:10 PM

టాలివుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ బైకుపై గాళ్ ఫ్రెండుని కూర్చోబెట్టుకుని హల్చల్ చేశాడు. అది క్యూటీ గాళ్ అనన్య పాండే బైక్ ట్యాంకర్ పై కూర్చొని హాట్ హాట్ పోజులిస్తుంటే కళ్లల్లో ఆనందం నింపుకుని రెట్టించిన ఉత్సాహంతో రివ్వున దూసుకుపోయాడు. ఐతే, ఇది రియల్ లైఫులో కాదు.. ఓ మూవీ షూటింగులో…

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్టు మూవీ ఫైటర్ షూటింగులో ఇదంతా జరిగింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యపాండే ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జతగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. విజయ్-అనన్యలపై ముంబై రోడ్లపై రాత్రి వేళ బైక్ రైడ్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీకయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఫైటర్ లో విజయ్ దేవరకొండ కొత్త గెటప్ లో యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఈ మూవీ కోసం విజయ్ థాయ్ ల్యాండ్ వెళ్‌లి మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఛార్మీ, కరణ్‌ జోహర్ ఈ సినిమాకి నిర్మాతలుగా వున్నారు.