NewsOrbit
సెటైర్ కార్నర్

గడప గడపకు “అభివృద్ధిఫలాలు”

(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
అమరావతి : అందరికీ అభివృద్ధిఫలాలు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన అందుకు ఏర్పాట్లు చేేసింది. గడపగడపకు “అభివృద్ధిఫలాల”ను అందించాలని సీఎం గాంధీ జయంతి సందర్భంగా ఉద్ఘాటించిన నేపథ్యంలో అధికారులు కదిలారు. అభివృద్ధి ఫలాలను సప్లై చేయడం కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. టెండర్లలో గనక అవకతవకలు జరిగితే రివర్స్ టెండరింగ్ తప్పదన్న సంగతిని కాంట్రాక్టర్లు గుర్తుంచుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం అభివృద్ధి ఫలాల ప్యాక్ ను గడప గడపకూ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్యాక్ లో ఏయే ఫలాలు ఉండాలో తేల్చడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించారు. 
డెంగ్యూ జ్వరం నివారణలో బొప్పాయి పని చేస్తుందంటున్నారు కనుక తప్పనిసరిగా ఆ పండును ప్యాక్ లో అందించాలని నిర్ణయించారు. అలాగే జామ, దానిమ్మ, బత్తాయి, యాపిల్ వంటి పండ్లను కూడా అభివృద్ధి ఫలాల ప్యాక్ లో చేర్చాలని భావిస్తున్నారు. ఈ ప్యాక్ పై “జగనన్న అభివృద్ధి ఫలాలు” అన్న పేరును ముద్రిస్తారు. అయితే వీటిలో ఏదీ పసుపు రంగులో ఉండకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ నేతలు పట్టుబట్టుతున్నట్లు తెలిస్తోంది. అరటిపళ్లు అసలు లేకుండా చూడాలని వారు పట్టుదలగా ఉన్నారు. ఏ పండైనా పండితే పసుపు రంగులోనే ఉంటుంది కనుక కనీసం పైభాగంలోనైనా పసుపు లేకుండా వైసీపీ కలర్ ఆకుపచ్చరంగులో ఉండేలా చూడాలని అధికారులకు మౌఖిక ఆదేశాలందాయి. లోన ఎలాగున్నా అభివృద్ధిఫలాల ప్యాక్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ముద్రిస్తారని చెబుతున్నారు. ఈ ప్యాక్ ను గడప గడపకూ అభివృద్ధిఫలాలు స్కీమ్ కింద కొత్తగా నియమించిన గ్రామవాలంటీర్ల ద్వారా అందించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఈ పథకం దేశంలోనే వినూత్నమైందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. 

ఈ ప్యాక్ తో పాటు గడప గడపకూ కనీసం కిలో ఇసుకను కూడా ఉచితంగా అందిస్తే బాగుంటుందనీ, దీంతో ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరు కాస్తా తొలగిపోతుందనీ వైసీపీ ప్రభుత్వ సలహాదారులు సూచించినట్లు సమాచారం. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనీ, అవసరమైతే పాటలు రాయించి విడుదల చేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా  తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ “అభివృద్ధిఫలాల”ను నేరుగా లబ్ధిదారులకే అందించినట్లైతే విపక్షాల నోళ్లు మూతబడతాయని ప్రభుత్వ సలహాదారులు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలావుండగా సీఎం జగన్ తన ప్రభుత్వ పరిపాలన అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రకటించినందున ఇకముందు మంత్రివర్గం సమావేశమయ్యే హాలును పూర్తి పారదర్శకంగా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఆ హాలును గాజు గోడలతో నిర్మించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశాలన్నీ గాజుగోడల నుంచి బయట ఉన్న అందరికీ పారదర్శకంగా కనబడేలా చేయాలన్నది దీని ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఎవరైనా సరే గాజుగోడల నుంచి మంత్రివర్గ సమావేశాలను నేరుగా వీక్షించే విధంగా బయట గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా మున్ముందు విపక్షాల నుంచి ఏ విమర్శలూ రాకుండా చూసుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శక సమావేశ మందిరాల ఏర్పాటు కూడా దేశంలోనే వినూత్నమైన ప్రయోగమని ప్రభుత్వం చెబుతోంది.

అభివృద్ధిఫలాలను ఇలా గడప గడపకూ అందించిన ప్రభుత్వం ఈ దేశంలోనే ఇంతకు ముందు లేదని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఒక ట్వీట్ లో వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తమ పథకాలు చూస్తుంటే వెన్నులో చలిపుడుతోందని ఆయన చురకలంటించారు. తమలాగా దేశంలో ఎవరైనా పారదర్శక పాలన అందిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. అయితే దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. అభివృద్ధి ఫలాలలో అరటి వంటి పసుపు పచ్చని పండ్లను నిషేధించడం అన్యాయమని ఆయన విమర్శించారు. కాగా, ఈ అభివృద్ధిఫలాల పథకంలో ఎర్రరంగులో ఉండే దానిమ్మను చేర్చడం పట్ల వామపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఎరుపు విప్లవానికి సంకేతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గుర్తు చేశారు.

——————————————————————————————————————————–

Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం.  ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.

author avatar
Srinivasa Rao Y

Related posts

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

KCR: ఆ ఇద్ద‌రు `లేడీ లీడ‌ర్లు` కేసీఆర్ ను ఎలా ఇరికిస్తున్నారంటే…

sridhar

Pawan Kalyan :డియర్ పవన్ కల్యాణ్… ఆంధ్రుడి లేఖ మీకు అందిందా?

sridhar

బాలకృష్ణ‌ పై టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి …. చంద్ర‌బాబు విష‌యంలో ఇలాగేనా చేసేది?

sridhar

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

Teja

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar

Dhivya Bharathi Joshful Photos

Gallery Desk

వామ్మో… ఫేస్‎బుక్‎లో గొడవయ్యిందని చంపేస్తావా…!!

sekhar

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

Srinivas Manem

ఓయ్, నీకర్థమౌతోందా..

Srinivas Manem

ట్రిప్పుల ట్రిక్కులు, తిప్పలు…!

Srinivas Manem

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y

ఆనియన్ ఛాలెంజ్!

Srinivasa Rao Y

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y

Leave a Comment