Tag : jagan latest news

బిగ్ స్టోరీ

సెల్ఫ్ గోల్ వేసుకున్న నిమ్మగడ్డ… పవర్ మొత్తం జగన్ చేతిలోకి! 

siddhu
ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం  మరో కొత్త మలుపు తీసుకుంది. హైకోర్టు తీర్పు యొక్క హైలెట్స్ ను టీవీలు బ్రేకింగ్ న్యూస్ గా వేయగానే నిమ్మగడ్డ లో అత్యుత్సాహం కట్టలు తెంచుకుంది. కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో పూర్తిగా చూపించరు. వారికి కావలసిన బ్రేకింగ్ పాయింట్స్ జనాలను ఆకర్షించేందుకు వేసుకొని అసలైన విషయాన్ని వివరించరు. అంతేకాకుండా అందరికన్నా ముందుగా తామే ఈ న్యూస్ జనాలకు చేరవేయాలని ప్రతి రిపోర్టర్ ఉన్న విషయాన్ని తమకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుని చెప్పేస్తుంటారు. సరే అసలు ఈ గొడవంతా ఎందుకు అంటే…. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారు అన్న విషయం కాపీ బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని బ్రేకింగ్ న్యూస్ రూపంలో వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హుటాహుటిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి కి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నారు. ఇంకా అక్కడితో ఆగాడా…? కోర్టు తీర్పు ప్రకారం తానే కమిషనర్ గా వస్తున్నట్లు జిల్లాలో అన్నింటికీ సర్కులర్ పంపమని ఆదేశించి పనిలో పనిగా తాను బాధ్యతలోకి దిగి పోయినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేకాకుండా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించి…. అతనికి కొద్ది వ్యవధి కూడా ఇచ్చే అవకాశం లేదని హూంకరించాడు. ఇక ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనకరాజు వెంటనే తప్పుకోవాలని హుకుం జారీ చేసిన ఆయన పైన తతంగం అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అయింది. ఈ లోపల సాయంత్రం హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దానిని మీడియా వారి ముందు పెట్టిన తర్వాత కానీ నిమ్మగడ్డకు అసలు విషయం బోధపడలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెబుతూ అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది కానీ అందుకు ప్రభుత్వానికి ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయమై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మళ్లీ కౌంటర్ పిటీషన్ వేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. కోర్టు వారు ఎటువంటి గడువు ఇవ్వలేదు కాబట్టి మిన్నగడ్డను పదవిలో నియమించేందుకు రెండు నెలల వ్యవధి ప్రభుత్వానికి ఇంకా ఉందని జస్ట్ శ్రీరామ్ వివరించారు. హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో  నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మరో వైపు జగన్ మాత్రం నిమ్మగడ్డ చూపిన అత్యుత్సహంతో ఇప్పుడు పవర్ అంతా తన చేతుల్లో ఉందని గ్రహించి సుప్రీం కోర్టుకు మరింత ఉత్సాహంతో వెళుతున్నాడు....
టాప్ స్టోరీస్

జూనియర్ కాలేజీల దోపిడీపై జగన్ మార్కు అదుపు…!

somaraju sharma
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...
టాప్ స్టోరీస్

‘రచ్చబండ’కు రెడీ అయిన సీఎం జగన్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి...
రాజ‌కీయాలు

ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకదా!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం...
న్యూస్

ఏపీ ప్రభుత్వంపై నోబెల్ శాంతి గ్రహీత ప్రశంసల జల్లు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు కురిపించారు. మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో కైలాస్ సత్యార్థి సమావేశమై పలు...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
టాప్ స్టోరీస్

పార్టీ పోరాడుతుంది: కేంద్రం జోక్యం చేసుకోదు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...
టాప్ స్టోరీస్

రాజధాని తరలింపే లక్ష్యం.. అసెంబ్లీలో బిల్లులు!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించే రాజధాని ప్రాంతం అభివృద్ధి...
టాప్ స్టోరీస్

టిడిఎల్‌పి సమావేశానికి అయిదుగురు డుమ్మా!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌తో...
రాజ‌కీయాలు

రాజధాని మారితే ఆ భవనాలను ఏం చేస్తారు ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని...