NewsOrbit

Tag : mandalaparthi kishor

వ్యాఖ్య

హైటెక్ “మోత” – రోబో వాత!

Siva Prasad
ఈ వారమంతా బడ్జెట్ “మోత”తో మార్మోగిపోయింది! ముఖ్యంగా బడ్జెట్ దెబ్బకు మీడియా దద్దరిల్లిపోయింది. తెలుగింటి ఆడపడుచయిన మన ఆర్ధిక మంత్రి మహోదయ –  జె.యెన్.యూ ప్రోడక్ట్ – నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్లో లేని...
వ్యాఖ్య

గోచినామిక్స్!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్‌ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే, ఆయన తమ్ముడయిన స్వామినాధన్ అంకాళేశ్వర్ అయ్యర్...
వ్యాఖ్య

ఆస్కారొచ్చే ఆస్కారం లేదా?

Siva Prasad
సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా – “సురా” అనేవారు.  ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు “సురా”. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే వాడు-...
వ్యాఖ్య

మనవాళ్ళు  మహానుభావులు!

Siva Prasad
ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం పెరుగుతూ పోయాయి. ఆర్థికాభివృద్ధి మాత్రం చీమనడక...
వ్యాఖ్య

2019 – అంతానికి ఆరంభం!

Siva Prasad
ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ. ఇవేళ్టితో 2019 సంవత్సరం అంతానికి తెరతీయడం మొదలవుతుంది. ఈ నెల పొడుగునా ఇంగ్లీష్ పత్రికలు “ఇయర్ ఎండర్స్” ప్రచురించడం ఓ ఆనవాయితీ. అదృష్టవశాత్తూ మనకి ఆ ఆచారం...
వ్యాఖ్య

చూడు చూడు నీడలు!

Siva Prasad
దిబ్బ-దిరుగుండాల ఉమ్మడి అధినేత పోతురాజు ఉత్తమ సంస్కారి! సొంత రాజ్యంలో, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికే విధేయ పౌరులనే అనుమానించే లక్షణం అతని సొంతం. పౌరులందరి మాటా అలా ఉంచండి- తన ప్రతి మాటకూ...
టాప్ స్టోరీస్

పెద్దమనసు “పేట్రియాట్”!

Siva Prasad
దాదాపు రెండు తరాల అభ్యుదయవాదుల కళ్ళు తెరిపించిన సి.రాఘవాచారి అక్టోబర్ 28  ఉదయం ఏడింటికి కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో మూడునాలుగేళ్లుగా అవస్థ పడుతున్నారు; రెండు మూడు వారాలుగా ఆస్పత్రిపాలైన రాఘవాచారి సోమవారం పొద్దుట కన్నుమూశారు....
వ్యాఖ్య

ఎంత చెట్టుకు అంత గాలి!

Siva Prasad
దిబ్బ రాజ్యాధినేత పోతురాజు విచిత్రమైన మనిషి(!) చాలామంది అతన్ని “మెత్తనిపులి” అనేవాళ్ళు. వ్యవహారం విషయానికి వస్తే భార్యాబిడ్డలతో కూడా నిక్కచ్చిగా ఉండేవాడు. ఇక బయటివాళ్ల విషయం చెప్పాలా? పోతురాజు పెద్దగా చదువుకోలేదనే రహస్యం దిబ్బరాజ్యంలో...
వ్యాఖ్య

సన్నాసి రాజ్యం చూడర బాబూ!

Siva Prasad
దిబ్బా దిరుగుండాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న పోతురాజు స్వగ్రామం కొత్వాలుకోట అని తమకు గతంలోనే మనవి చేసుకున్నా! పోతురాజు మహారాజు కాగానే ఆ వూళ్ళో  పిన్నాపెద్దా -ముఖ్యంగా ఆడవాళ్లు –  తెగబోలెడు ఆనందించారు. “హమ్మయ్యా! రేపణ్ణుంచి...
వ్యాఖ్య

అమ్మయ్య! నా జాతి మేల్కొనే ఉంది..!

Siva Prasad
కొన్నాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు – మరి కొన్నాళ్ళు మూర్ఛపోయి ఉండొచ్చు – ఇంకొన్నాళ్ళు మైకంలో ములిగిపోయి ఉండొచ్చు – కొన్నాళ్ళు తమకంతో తడిసిపోయి ఉండొచ్చు – లేదంటే, పరధ్యానంలో పడిపోయి ఉండొచ్చు – ఎదో...
వ్యాఖ్య

పోతురాజు పాలన!

Siva Prasad
ఇంతకుముందే చెప్పినట్లు, దిబ్బ రాజ్యం – దిరుగుండం సరిహద్దు రాజ్యాలు. ఆ రెండు రాజ్యాలకూ ఇద్దరు మూర్ఖులు రాజులుగా ఉండేవారు. వాళ్లిద్దరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే రోజున కన్ను మూశారు. ఆ రాజుకూ, ఈ రాజుకూ...
వ్యాఖ్య

కొరడాల కొత్వాలు!

Siva Prasad
 అనగనగా ఓ దిబ్బరాజ్యం. దానికి పొరుగునే దిరుగుండం అనే రాజ్యం ఉండేది. దిబ్బరాజ్యం పౌరులందరూ దిరుగుండంలో గూఢచారులుగా ఉండేవారు. దిరుగుండం పౌరులు అదే పనిమీద దిబ్బరాజ్యంలో పడి ఏడుస్తూ ఉండేవారు. అక్కడి ప్రజలందరూ గూఢచారులేననే...
వ్యాఖ్య

పగ సాధిస్తా! నిను వేధిస్తా!!    

Siva Prasad
ప్రపంచం లో చైనీస్ సరుకులు అమ్మని చోటు లేనట్లుగానే, ఆ దేశపు సామెతలు చెల్లుబాటు కానీ రంగాలు కూడా లేవు. ఉదాహరణకి ఈ సామెత చూడండి-  “పగసాధించి తీరాల్సిందే అనుకునే వాళ్ళు రెండు సమాధులను...
వ్యాఖ్య

అనగనగా ఓ రాజరికం!

Siva Prasad
అనగనగా, ఓ దేశం. అక్కడ పాలకులను ప్రజలే ఎన్నుకునేవారు. అలా ఆ దేశానికి ఓ రాజు- ఓ మంత్రి- ఓ సేనాధిపతి ఎన్నికయ్యారు. మంత్రికి పాలన వ్యవహారాల్లో అనుభవం పుష్కలంగా ఉంది. సేనానికి సైనిక...
వ్యాఖ్య

మనసులో సున్నితపు త్రాసు!

Siva Prasad
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు – ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ ‘చిత్రకథ’ చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** “అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు. ఒకామె...
వ్యాఖ్య

అంకెలు చెప్పని కథ!

Siva Prasad
“నీ మిత్రులెవరో ఒక్కసారి చెప్పు- నువ్వెలాంటి వాడివో నేను చెప్తా” అన్నాడట అయిదువందల ఏళ్ళ కిందటి షేక్స్పియర్. “నీ బడ్జెట్ ఒక్కసారి చూడనీ- నువ్వు దేనికి విలువిస్తావో నేను చెప్తా!” అన్నాడట మన కాలపు...
వ్యాఖ్య

చిత్ర విచిత్ర సారంగం!

Siva Prasad
సంస్కృత భాష చాలా  విచిత్రమైనది. ఒక్కో మాటకు అనేక అర్థాలు ఉండడం ఆ భాషలో సహజం. ఉదాహరణకు “సారంగ” శబ్దమే తీసుకోండి- ఆ మాటకు నిఘంటువులు ఇచ్చిన అర్థాల్లో పోలికే కనబడదు! సారంగమంటే కృష్ణ...
వ్యాఖ్య

వర్తమానమే వాస్తవం!

Siva Prasad
1970 దశకం మొదట్లో “కల్- ఆజ్- ఔర్ కల్” అనే సినిమా వచ్చింది. అంటే, అర్థం “నిన్న-నేడు-రేపు” అని. అది మూడు తరాల కథ. ఈ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు అర్ధశతాబ్ది కావస్తోంది....
వ్యాఖ్య

మేర మీరిన మేథ!

Siva Prasad
మన దేశం చేసుకున్న పుణ్యం ప్రధాన మంత్రి రూపంలో మనకు నిత్యం దర్శనమిస్తూనే ఉంది. మోడీ సాదా సీదా ప్రధాని కాదు కదా! ఆయన ఛాతీ వెడల్పు యాభయ్యారు అంగుళాలు ఉందో లేదో ఆయనకు...
వ్యాఖ్య

అనగనగా ఓ అంటువ్యాధి!

Siva Prasad
అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు  చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత విషయమే తీసుకోండి- రోమ్ నాగరికులకు తెలిసిన...
వ్యాఖ్య

ఒక ఓటు – వంద అర్థాలు!

Siva Prasad
“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. “నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి  మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!...
వ్యాఖ్య

ఆ “నోటా”, ఈ “నోటా”…

Siva Prasad
“అసమర్ధతకి ఓటేయాలా, అవినీతికి ఓటేయాలా? ప్రచారానికి ఓటేయాలా, ప్రగల్భానికి ఓటేయాలా?? సొంత డబ్బాకి ఓటేయాలా, తాతల నాటి నేతి డబ్బాకి ఓటేయాలా?? ఎటూ తేల్చుకోలేక భవిత – నోటా బటన్ నొక్కేసింది యువత!” మన...
వ్యాఖ్య

మీకేం కావాలి?

Siva Prasad
‘చచ్చిన చేపలు, నీటిలో తేలి, వాలుకు కొట్టుకుపోతాయి- కానీ, బతికున్న చేపలు మాత్రమే ఏటికి ఎదురీదగల’వన్నాడో అమెరికన్ హాస్యగాడు. తెలుగునాట- రెండు రాష్ట్రాల్లోనూ- జమిలిగా వ్యక్తమవుతున్న ‘ఎలక్షణాలు’ చూస్తుంటే, ఈ వ్యాఖ్య చటుక్కున స్ఫురించడం...