NewsOrbit

Tag : YSJagan Government

బిగ్ స్టోరీ

టాప్ మినిస్టర్ కి జగన్ క్లాస్… నిఘా పెట్టి మరి నిజాలు లాగిన సి‌ఎం?

siddhu
అవకాశం దొరకాలే కానీ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్న తమ చేతిలో పదవి మరియు అధికారం ఉంటే అవినీతి సొమ్ముని సంపాదించుకునేందుకు వెనుకాడరు. అసలు అలాంటి ఉద్దేశం లేని నాయకుడు ఒక రాజకీయ నాయకుడే కాదు అనే రేంజ్ లో నేటి తరం నాయకులు బ్రతుకుతున్నారు. ఈ విషయానికి ఎవరూ అతీతులు కాదు అన్న విషయం యావత్ ప్రజానీకం గుండెల్లో బలంగా పాతుకుపోయింది. పార్టీ అధినేత తమను పట్టించుకోకపోతే చాలు…. నాయకులు అవకాశం వెత్తుక్కొని మరీ చెలరేగిపోతారు.. దొరికిన కాడికి దోచేసుకుంటారు. ఫలితంగా అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా పాకుతుంది. గతంలో అవినీతి నేతలను మొదట్లో కంట్రోల్ చేసిన చంద్రబాబు చివరి రెండేళ్ళలో పూర్తిగా చేతులెత్తేయడమే ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడానికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది అని పలువురు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. మరి పరిస్థితి అలా జరిగితే ఒక్క తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న ఏ పార్టీ అయినా మట్టికొట్టుకునిపోవడం ఖాయం. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి జగన్ అటు అధికారులతో పాటు ఇటు సొంత ఎమ్మెల్యే లను మరియు మంత్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో రాజకీయ నాయకుల స్వభావంపై ఎటువంటి నమ్మకం లేని జగన్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మరియు రూల్స్ ఎంత కఠినం చేసినా అనివార్య పరిస్థితుల్లో పరిస్థితి తప్పు దారి పట్టే ప్రమాదం ఉందని గమనించిన ఆయన పురపాలక శాఖ శాఖ, ఎక్సైజ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, గ‌నుల శాఖ‌ వంటి కీలక శాఖల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ రిపోర్టు కూడా తీసుకుంటున్నారని గతంలోనే వైసీపీలో చర్చకు వచ్చింది. ఇక మహిళా మణులు మంత్రులుగా శాఖల్లో వారి భర్తలు చక్రం తిప్పుతున్నారు అని జగన్ కు సమాచారం అందింది. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి విషయంలో ఇదే జరిగే సరికి జగన్ సదరు మినిస్టర్ కి గట్టిగానే క్లాస్ పీకారన్న ప్రచారం తాజాగా వెలుగు చూసింది. బదిలీలు, ప్రమోషన్లు విషయంలో అతని చేతులు టేబుల్ కిందకి వెళ్లాయని మరియు దీనికి సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో జగన్ ఇక జోక్యం చేసుకోక తప్పలేదని వైసిపి వర్గాల్లో ఈ విషయం మారుమోగుతుంది. ఇదే విధంగా మిగిలిన శాఖల్లోనూ ఇదే తరహాలో కొన్ని ఫిర్యాదులు అందాయని వారికి కూడా జగన్ చాలా గట్టిగా క్లాస్ పీకిన ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనకు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని తీసుకుని వచ్చి ఆయా శాఖలకు పీఆర్వో లుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించి ఎటువంటి అవినీతి జరిగేందుకు వీలు లేకుండా జగన్ చేసేశారట. దీంతో స‌ద‌రు మంత్రులు ఇప్పుడు అడుగు ఎటు తీసి ఎటు వేయాల‌న్నా కూడా హ‌డ‌లి పోతున్నార‌ని, వారు ఏం చేసినా క్షణాల్లోనే జ‌గ‌న్‌కు స‌మాచారం వెళ్తోంద‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు మంత్రుల శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్షలు కూడా నేరుగా సీఎం చేసే ప‌రిస్థితి ఉందంటున్నారు...
టాప్ స్టోరీస్

జూనియర్ కాలేజీల దోపిడీపై జగన్ మార్కు అదుపు…!

sharma somaraju
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...