Lowest price cars: ఈ 3 కార్లు ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ..

Share

Lowest price cars: ప్రతి ఒక్కరికి కారులో ప్రయాణించాలని ఉంటుంది.. అయితే కారు ధర సామాన్యుడికి అందుబాటులో ఉండదు.. అంతేకాకుండా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితిలో అధిక మైలేజ్ ఇచ్చే కారు కూడా ఉండాలి. వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ కార్ల కోసం చూస్తున్నారా.. అయితే ఈ 3 కార్లు ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. ఇప్పుడు ఆ మూడు కార్లు గురించి తెలుసుకుందాం..

3 Lowest price cars: with good milage
3 Lowest price cars: with good milage

1. టాటా టియాగో :

ఈ కారు ఒక లీటర్ పెట్రోల్ కి 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ కారు 9 వేరియంట్లలో లభిస్తుంది. టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర రూ.4.85 – 6.84 లక్షలు.. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో నడుస్తుంది..

3 Lowest price cars: with good milage
3 Lowest price cars: with good milage

2. రెనాల్ట్ క్విడ్ :

ఈ కారు 0.8 లీటర్, 1.0 లీటర్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది.. రెనాల్ట్ క్విడ్ 5 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో STD, RXE, RXL, RXT రకాలు ఉన్నాయి. ఈ కారు ఒక లీటర్ పెట్రోల్ కి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.85 – 6.84 లక్షలు..

 

3. మారుతి ఆల్టో :

ఈ కారు జీరో 0.8 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది.. ఈ పెట్రోల్ ఇంజన్ 48 పిఎస్ శక్తిని, 69 ఎన్ ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 3 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.99 – 4.48 లక్షలు.. ఈ కారు లీటర్ పెట్రోల్ కి 22.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : హౌస్ లో ముద్దులు, కౌగిలింతలు, చిలిపి మాటలు..! కానీ ఆ జంటను ఎవరూ పట్టించుకోరే..?

arun kanna

టోల్ గేటు వద్ద కారు ఆపితే ఆ మహిళా నేత ఏమి చేసిందో తెలుసా.. ?

somaraju sharma

టీడీపీలోకి కీలక నేతలు..!? సంక్రాంతి తర్వాత వలసలు షురూ..!!

Srinivas Manem