స్మార్ట్ టీవీ కొనాల‌ని చూస్తున్నారా ? రూ.15వేల లోపు ల‌భిస్తున్న 5 బెస్ట్ టీవీలు ఇవే..!

టీవీ కొనాలంటే ఒక‌ప్పుడు పెద్ద ప్ర‌హ‌స‌నంగా ఉండేది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్‌లో క్ష‌ణాల్లోనే మ‌న‌కు న‌చ్చిన టీవీని కొనుగోలు చేసే అవ‌కాశం ల‌భిస్తోంది. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఒక‌టి రెండు రోజుల్లోనే మ‌న ఇంటి వద్ద‌కే టీవీలు డెలివ‌రీ అవుతున్నాయి. ఇక చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే ప్ర‌స్తుతం స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్‌లో అనేక కంపెనీలు టీవీల‌ను విక్ర‌యిస్తున్న‌ప్ప‌టికీ కొన్ని కంపెనీల‌కు చెందిన టీవీల‌కు మాత్ర‌మే వినియోగ‌దారుల నుంచి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలోనే మార్కెట్‌లో రూ.20వేల‌ లోపు ల‌భ్య‌మ‌వుతున్న బెస్ట్ స్మార్ట్ టీవీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

5 best smart tvs available under 15000

1. సాన్యో కైజ‌న్ ఎక్స్‌టీ-32ఆర్‌హెచ్‌డీ4ఎస్

ఈ మోడ‌ల్ 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.12,999గా ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ప్లే స్టోర్ యాక్సెస్ అవుతుంది. హెచ్‌డీఎంఐ పోర్టులు 3, యూఎస్‌బీ పోర్టులు 2 ఇచ్చారు. 8 జీబీ స్టోరేజ్ ఉంది. అందువ‌ల్ల యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

2. మోటోరోలా 32ఎస్ఏఎఫ్‌హెచ్‌డీఎం

ఈ మోడ‌ల్ 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.14,999గా ఉంది. ఇందులోనూ ఆండ్రాయిడ్ ఓఎస్ ల‌భిస్తుంది. 2 హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీ పోర్టుల‌ను ఇచ్చారు.

3. ఒనిడా 32 ఇంచ్ ఫైర్ టీవీ ఎడిష‌న్

ఈ మోడల్ టీవీ ధ‌ర రూ.13,999గా ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ ఓఎస్ లేదు. అమెజాన్ ఫైర్ ఓఎస్ ఉంది. ఇది కూడా ఆండ్రాయిడ్ లాగే ప‌నిచేస్తుంది. దీంట్లో 3 హెచ్‌డీఎంఐ, 1 యూఎస్‌బీ పోర్టును ఇచ్చారు. అలెక్సా వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ దీనికి ల‌భిస్తుంది. అందువ‌ల్ల అలెక్సాతో టీవీని ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు.

4. ఎల్‌జీ 32ఎల్ఎం565బీపీటీఏ

ఈ మోడ‌ల్ 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.14,999గా ఉంది. దీంట్లో ఆండ్రాయిడ్ ఓఎస్ లేదు. వెబ్ ఓఎస్‌ను ఇచ్చారు. కానీ ఆండ్రాయిడ్ లాగే ప‌నిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వంటి యాప్స్ ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. 2 హెచ్‌డీఎంఐ, 1 యూఎస్‌బీ పోర్టును ఇచ్చారు.

5. శాంసంగ్ వండ‌ర్‌టెయిన్‌మెంట్ యూఏ32టి4320ఏకేఎక్స్ఎక్స్ఎల్

ఈ మోడ‌ల్ 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.14,990గా ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ లేదు. శాంసంగ్‌కు చెందిన టైజ‌న్ ఓఎస్ ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లాగే దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఇందులో ప‌నిచేస్తుంది. 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 1 యూఎస్‌బీ పోర్టును ఇచ్చారు.