5G Technology: హై స్పీడ్ ఫైవ్ జీ టెక్నాలజీ ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ రంగాలలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని, దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అధినేత ఆకాష్ అంబానీ తెలిపారు.. 5 జి టెక్నాలజీ బడ్జెట్ ప్రతిపాదన పై ఏర్పాటు చేసిన వెబినార్ లో ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. నగరాలు స్మార్ట్ గా మారిపోవడంతో పాటు సమాజాన్ని సురక్షితంగా మార్చడంలో అత్యధిక టెలికాం నెట్వర్క్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో 5G టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఆరు నెలల్లోనే అది మారుమూల ప్రాంతాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో ని 2007 నగరాల్లో జియో ఒక్కటే 5జీ సర్వీసును ప్రారంభించిందని ఆయన చెప్పారు. 5G నెట్వర్క్ సాంకేతిక తో కూడిన అంబులెన్స్ రిమోట్ గా అత్యవసరంగా సహాయం అందించడమే కాకుండా రోగి పరిస్థితికి సంబంధించిన వైద్య సమాచారాన్ని వెంటనే ఆసుపత్రులకు చేరవేస్తుందన్నారు. అలాగే ఎటువంటి జాప్యం లేకుండా పంపగలరని 5జీ టెక్నాలజీ కొత్త ఎడ్యుకేషన్ కు సంబంధించిన అనేక యాప్స్ పనిచేసేందుకు చురుగ్గా ఉపయోగపడుతుందను తెలిపారు.
5G నెట్వర్క్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సాంకేతిక ఆల్ట్రా- తక్కువ లేటెన్సిలో కూడా సమర్థవంతమైన సేవలను అందిస్తుంది. మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన డేటా సేకరణ ప్రజా సేవలు జీవన నాణ్యతలను అందించేందుకు విప్లవాత్మకమైనది. సాంకేతికత క్లౌడ్ గేమింగ్, 8K స్క్రీమింగ్ వీడియో , కంటెంట్ ద్వారా అందించే వినోదంలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది. వైద్యులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫ్యాక్టరీకార్మికులు, చిన్న వ్యాపారాలు చేసే వారికి 5జీ టెక్నాలజీ వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందని ఆకాష్ ఆశాభావం వ్యక్తం చేశారు..