Aaradugula Bullet: “ఆరడుగుల బుల్లెట్” ఈసారైనా రిలీజ్ కు నోచుకుంటుందా..!!

Share

Aaradugula Bullet: గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం “ఆరడుగుల బుల్లెట్”.. ఈ సినిమా చిత్రీకరణ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని చాలా కాలం అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు మోక్షం రాలేదు.. ఇటీవల ఓటిటి లో రిలీజ్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ రిలీజ్ మాత్రం కాలేదు.. తాజాగా మరోసారి చిత్రయూనిట్ ఈ సినిమా రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇచ్చింది..

Aaradugula Bullet: movie release date announced soon
Aaradugula Bullet: movie release date announced soon

Read More: Sonu Sood: నాన్న స్కూటర్ పై సోను సూద్.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్..

బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జయ బాలాజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించారు. ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మరి ఈసారైనా ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కు నోచుకుంటుందో లేదో వేచి చూడాలి.


Share

Related posts

ఈ యాప్ స్మోకింగ్‌ను మాన్పుతుంది ..ఎంతకాలం బతుకుతారో చేప్పేస్తుంది

Teja

YS Sharmila: వైఎస్ షర్మిలకు టీఆర్ఎస్ నేతల షాక్..!!

somaraju sharma

గుడ్ న్యూస్‌.. యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఐప్యాడ్ ఎయిర్ 4 ల‌భ్యం..

Srikanth A