మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ల.. అయితే ఇది తెలుసుకోండి!

కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించి, ఆ శుభవార్తను ఆనందించేలోపే కళ్లు బైర్లు కమ్మే వార్తను చేరవేస్తాయి టెలికాం సంస్థలు. ఆనందం..అంతలోపే విషాదం అనే టైటిల్ ను వీటికోసమే పుట్టుకొస్తాయనిపిస్తుంటుంది వీటి తీరును చూస్తుంటే. అతి తక్కువ ధరలకే డేటాను, ఉచిత కాల్స్ ను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లకు ఆఫర్ మీద ఆఫర్లు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే మెల్లమెల్లగా రీచార్జ్ ధరలను కూడా అమాంతం పెంచుకుంటూ పోతున్నాయి ఈ టెలికాం సంస్థలు . కాగా ఇప్పటివరకు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ తో సహా ఇతర కంపెనీలు చార్జీలను పెంచేశారు. ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

కాగా ఎయిర్ టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విట్టల్ పరోక్షంగా మొబైల్ టారిఫ్ ధరల పెంపు ఉంటుందని తెలిపారు. ఎయిర్ టెల్ ఆర్థిక ఫలితాల తర్వాత ఆయన కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడారు. అందులో భవిష్యత్ లో మొబైల్ టారిఫ్ ధరల పెంపుదల గురించి ప్రస్తావించారు. అయితే అవి ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం స్పష్టం ఇవ్వలేదు.

యూజర్ నుంచి లభించే సగటు ఆదాయాన్ని రూ. 200, రూ.300 గా నిర్దేశించుకున్నామని విట్టల్ తెలియజేశారు. అలాగే సెప్టేంబర్ క్వర్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్ పీయూ రూ.162 కు చేరింది. దీన్ని రూ.200 కు తర్వాత, రూ.300 లకు పెంచుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తోంది. కాగా భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ కూడా ఆగస్ట్ నెలలో టారిఫ్ ధరల పెంపు అంశాన్ని ప్రస్తావించారు కూడా.. ఇప్పటికే ఈ ఎయిర్ టెల్ బాదుడుకు చాలా మంది తమ నెట్ వర్క్ ను కూడా మార్చుకున్న వారున్నారు. మరి దీనితో కస్టమర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.