శుభవార్త.. వినియోగదారులకు లోన్ ఇవ్వనున్న ఎయిర్‌టెల్.. కానీ వారికీ మాత్రమే!

దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకొస్తూ ప్రజలకు మరింత చేరువవుతూనే ఉంటుంది. తాజాగా మరొక కొత్త సూపర్ ఆఫర్ తో ప్రజలను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది ఎయిర్ టెల్ సంస్థ. అదే ఎయిర్ టెల్ జీరో కాస్ట్ లోన్ ఆఫర్.. దీని ద్వారా 4జీ మొబైల్ ఫోన్ ను కొనాలనుకునే 2 జీ వినియోగదారులకు రుణ సదుపాయం అందిస్తోంది.

ఎయిర్ టెల్ 2జీ కస్టమర్లు 4జీ స్మార్ట్ ఫోన్లు కొనడానికి‘జీరో కాస్ట్ లోన్’అనే కొత్త ఆఫర్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టిందని తెలుస్తోంది. ఈ ఆఫర్ కోసమే ప్రత్యేకంగా ఎయిర్ టెల్ ఐడీఎఫ్ సీ బ్యాంకుతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నది. దీంతో ఐడీఎఫ్ సీ బ్యాంక్ డౌన్ పేమెంట్ రూ. 3,259 చెల్లించడానికి కస్టమర్లకు లోన్ కూడా ఇవ్వనుంది.

కాగా ఈ ఫోన్ అసలు ఖరీదు రూ. 6,800 గా ఉండనుంది. ఈ ఫోన్ ను కొనాలనుకునే వారు ప్రతి నెలా రూ.603 ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఈఎంఐ కాలపరిమితి కేవలం పది నెలలు. దీంతో వినియోగదారులు రూ. 9,289 చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఈ పది నెలల కాలంలో మొబైల్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఈ మొబైల్ కు ప్రత్యేక ఫెసిలిటీస్ ను కూడా అందించనుంది. ఈ సంస్థ వైఫై కాలింగ్ ఫీచర్ ను 200 కు పైగా డివైస్ లను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం 60 రోజులు మాత్రమే ఉంటుందని సంస్థ వెళ్లడించింది. కాని అర్హులైన వినియోగదారులకు మాత్రమే ఇది వర్తించనుందని తెలిపింది. మరింకేందుకు ఆలస్యం త్వరపడండి తొందరగా..