షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ హువామీ ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్లు కలిగిన స్మార్ట్‌వాచ్‌లను తయారు చేసి విడుదల చేస్తుంటుంది. అవి తక్కువ ధరలను కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ కంపెనీ మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను అమేజ్‌ఫిట్ నియో పేరిట భారత్‌లో విడుదల చేసింది. ఇందులోనూ ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
అమేజ్‌ఫిట్ నియో స్మార్ట్‌వాచ్‌లో 1.2 ఇంచుల బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే ఉంది. సూర్యకాంతిలోనూ ఈ డిస్ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. లిఫ్ట్ టు వేక్ ఫీచర్ ఇందులో ఉంది. అందువల్ల చేతిని కొద్దిగా లిఫ్ట్ చేస్తే వాచ్ డిస్ప్లే ఆన్ అవుతుంది. దీంతో అన్ని వివరాలను అందులో తెలుసుకోవచ్చు. 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్‌ను ఇందులో ఇచ్చారు. దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 3 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. ఈ వాచ్ సుమారుగా 4 వారాల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, వెదర్, ఇతర యాప్‌లకు చెందిన నోటిఫికేషన్లను ఈ వాచ్ స్క్రీన్‌పై ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. స్లీప్ మానిటరింగ్, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాకర్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు ఈ వాచ్‌ను బ్లూటూత్ 5.0 ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.
అమేజ్‌ఫిట్ నియో స్మార్ట్ వాచ్ రెడ్, బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.2499 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా స్టోర్లలో అక్టోబర్ 1 నుంచి లభ్యం కానుంది.