టెక్నాలజీ

వాట్సాప్ లో స్టేటస్ కి సంబంధించి కొత్త అప్ డేట్..!!

Share

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా బహు ప్రభావితంగా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియాలో ఆ విషయం ముందుగానే వచ్చేస్తూ ఉంది. నిమిషాలు మరియు సెకండ్లలో సమాచారం అందే పరిస్థితి. సోషల్ మీడియాలో చాలా విభాగాలు ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్.. ప్రతి మనిషి జీవితంలో భాగం అయిపోయింది. దీనిలోనే చాటింగ్ తో పాటు ఫ్రీగా ఫోన్ కాల్స్… వీడియో కాల్స్ చేసుకునే పరిస్థితి.. ఉండటంతో అందరూ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.

Another new update on WhatsApp..!!

ఇటువంటి దారుణంలో వాట్సాప్ యాజమాన్యం కూడా తమ వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంది. ఇప్పటికే వాట్సాప్ లాస్ట్ సీన్.. ఇంకా రియాక్షన్స్ వంటి వాటికి సంబంధించి కొత్త అప్ డేట్ గతంలో ఇవ్వటం తెలిసిందే. వాట్సాప్ వినియోగదారుడు భద్రతకి సంబంధించి లాస్ట్ సీన్ అందరూ చూసుకునే ఆప్షన్ తీసేసి… సదరు కాంటాక్ట్ వాళ్లు మాత్రమే చూసేలా ఆప్షన్ తీసుకొచ్చారు. ఇంకా ప్రొఫైల్ పిక్… నచ్చిన వాళ్ళకి మాత్రమే చూపించే రీతిలో కూడా ఆప్షన్ తీసుకొచ్చారు.

Another new update on WhatsApp..!!

ఇదే రీతిలో ఎబౌట్ కూడా సెలెక్టెడ్ వాళ్లకి మాత్రమే తెలిసేలా చేశారు. కాగా లేటెస్ట్ గా ఇప్పుడు ఇతర మెసేజింగ్ యాప్స్ తో పోటీ పడుతూ కొత్త ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్… చాట్ లిస్టులోనే స్టేటస్ చూసే అవకాశాన్ని కల్పించడానికి రెడీ అయింది. వాట్సాప్ బీటా యూజర్ లకు…ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. టెస్టింగ్ లో ఉన్న ఈ ఫ్యూచర్.. త్వరలో వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.


Share

Related posts

భార‌త్‌లో విడుద‌లైన పోకో ఎం2 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు..

Srikanth A

దేశం ఆర్థికంగా పుంజుకుంటుందా…?? ఐటి విభాగం ఏం చేపుతోంది..??

Special Bureau

Spotify Technology  : మ్యూజిక్ ప్రియులకు కొత్త టెక్నాలజీ..!!

bharani jella