గుడ్ న్యూస్‌.. యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఐప్యాడ్ ఎయిర్ 4 ల‌భ్యం..

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ గ‌త నెల‌లో ఐప్యాడ్ ఎయిర్ 4వ జ‌న‌రేష‌న్ ట్యాబ్లెట్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదితమే. ఓ ఈవెంట్‌లో యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 4తోపాటు ఐప్యాడ్ 8వ జ‌న‌రేష‌న్ ట్యాబ్‌లు, యాపిల్ వాచ్ సిరీస్ 6 వాచ్‌లు, యాపిల్ వాచ్ ఎస్ఈని విడుద‌ల చేసింది. కాగా కొత్త ఐప్యాడ్ ఎయిర్ 4 ప్ర‌స్తుతం యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. అలాగే అమెజాన్ వెబ్‌సైట్‌లోనూ త్వ‌ర‌లో దీన్ని విక్ర‌యించ‌నున్నారు.

apple ipad air 4 now available in apple india online store

ఐప్యాడ్ ఎయిర్ 4 లో అధునాత‌న యాపిల్ ఎ14 బ‌యానిక్ చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఐప్యాడ్ ఓఎస్ 14 ల‌భిస్తుంది. యాపిల్ పెన్సిల్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. కాగా యాపిల్ సంస్థ ఇటీవ‌లే ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల‌ను కూడా లాంచ్ చేసింది. ఇవి రూ.69,900 ప్రారంభ ధ‌ర‌కు భార‌త్‌లో ల‌భిస్తున్నాయి. వీటికి ప్రీ ఆర్డ‌ర్ల‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు.

ఐప్యాడ్ ఎయిర్ 4 రెండు స్టోరేజ్ వేరియెంట్ల‌లో ల‌భిస్తోంది. 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఇది అందుబాటులో ఉంది. 64 జీబీ వైఫై మోడ‌ల్ ధ‌ర రూ.54,900 ఉండ‌గా, 256 జీబీ వైఫై మోడ‌ల్ ధ‌ర రూ.68,900 ఉంది. అదేవిధంగా 64జీబీ వైఫై + సెల్యులార్ మోడ‌ల్ ధ‌ర రూ.66,900 ఉండ‌గా, 256 జీబీ వైఫై + సెల్యులార్ మోడ‌ల్ ధ‌ర రూ.80,900 గా ఉంది.

ఐప్యాడ్ ఎయిర్ 4 మోడ‌ల్స్ సిల్వ‌ర్‌, స్పేస్ గ్రే, రోజ్‌గోల్డ్‌, గ్రీన్‌, స్కై బ్లూ క‌ల‌ర్ ఆప్షన్ల‌లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్‌లో ప్ర‌స్తుతం ఈ కొత్త ఐప్యాడ్ ఎయిర్ 4ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీంట్లో 10.9 ఇంచుల లిక్విడ్ రెటీనా డిస్ ప్లేను ఇచ్చారు. ట‌చ్ ఐడీ, యూఎస్‌బీ టైప్ సి, 12, 7 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఈ ట్యాబ్ 10 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంది.