అలనాటి “బజాజ్ చేతక్” సరికొత్త రికార్డులు..! అవేమిటో చూసేయండి..!!

 

ఒక నాడు భారతీయ టు వీలర్ మార్కెట్ను బజాజ్ చేతక్ ఒక ఊపు ఊపింది. తాజాగా న్యూ లుక్ తో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమైంది..ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘బజాజ్ చేతక్’ ఇప్పుడు ఓ కొత్త మైలురాయని చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదలైనప్పటి నుండి 1000 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వివరించింది. ఇది బజాజ్‌కు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. దేశీయ మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది.

కలర్స్ :
చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్, సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

మోడ్రన్ రెట్రో డిజైన్‌ల కలయికతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత కాలపు బజాజ్ చేతక్‌ను తలపించేలా మోడ్రన్ స్టయిల్‌ను కలిగి ఉంటుంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు క్రమంగా పుంజుకుని, నెలవారీ వృద్ధిని పెంచాయి. ఇది బజాజ్‌కు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. దేశీయ టూ వీలర్ మార్కెట్లో తమ కంపెనీ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసిందని ఇప్పుడు మార్కెట్ ఎలక్ట్రికల్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించి మరింత ముందడుగు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఫీచర్లు :
చేతక్ ఎలక్ట్రిక్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి. దీనినీ 5 గంటల పాటు చార్జ్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ లో 85 కిలోమీటర్లు, ఈకో మోడ్లో 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది ip67 రేటింగ్ గల హైటెక్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. 5-15 ఎంఎంపిఎస్ ఎలక్ట్రికల్ ఔట్లెట్లలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంటిలిజెన్స్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం ఉంది‌. ఇది బ్యాటరీని నియంత్రిస్తుంది.అంతేకాకుండా రీ జనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను అమర్చారు. ఇది బ్రేకింగ్ కారణంగా వచ్చే వేడిని గతిశక్తిగా మార్చేసి స్కూటర్ రేంజ్ని పెంచుతుంది.ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ మోడల్. ప్రీమియం ఇ-స్కూటర్ విభాగంలో విడుదలైన బజాజ్ చేతక్, ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, టివిఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.