భారత దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రస్తుతం ఎంతటి పోటీ ఉందో అందరికీ తెలిసిందే. తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ పోటీని తట్టుకోలేక కూల్ ప్యాడ్ కంపెనీ వెనుకబడింది. కానీ తాజాగా ఈ కంపెనీ మళ్లీ ఆ రేసులో నిలిచింది. అందులో భాగంగానూ కూల్ 6 పేరిట ఆ కంపెనీ కొత్తగా ఓ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉంది.
కూల్ ప్యాడ్ కూల్ 6 స్మార్ట్ ఫోన్లో 6.53 ఇంచుల డిస్ప్లే ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఫోన్‌ను అద్భుతమైన డిజైన్‌తో తీర్చిదిద్దారు. అందువల్ల దీని లుక్ బాగుంటుంది. ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్‌ను అమర్చారు. 4, 6 జీబీ ర్యామ్, 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డెడికేటెడ్ స్లాట్ లేదు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 21 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పాపప్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. బ్లూటూత్ 5.0 లభిస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
* కూల్ ప్యాడ్ కూల్ 6 స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999.
* 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999. అమెజాన్ లో ఈ ఫోన్ లభిస్తుంది.