NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల నయ దందా.. ఈ సారి వాట్సప్ తో టోపీ..!!

Cyber Crime: సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.. రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటు అమాయక ప్రజలు మోసపోయేలా చేస్తున్నారు.. ఎవరు చేశారో తెలియని విధంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి.. సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ ప్రొఫైల్ తో బురిడీ కొట్టించి టోపీ వేస్తున్నారు..

 Cyber Crime: new technique using their WhatsApp profile pic
Cyber Crime new technique using their WhatsApp profile pic

Read More: RRR Movie: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీ రీకౌంటర్ ఇచ్చిన  ఆర్ఆర్ఆర్ టీమ్..!!

తాజాగా హైదరాబాద్ బోయినపల్లి చెందిన దిలీప్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు న్యూయార్క్ లో ఉంటున్న తన స్నేహితుడు రమేష్ ప్రొఫైల్ పిక్ తో ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. వాళ్ల బాబాయి కరోనాతో ఆసుపత్రిలో చేరారని, అత్యవసరంగా రూ.2 లక్షలు కావాలని, డబ్బులు పంపిస్తే రెండు రోజుల్లో తిరిగి ఇస్తానని మెసేజ్ రావడంతో.. ముందు వెనకా ఆలోచించకుండా వెంటనే డబ్బులు పంపించాడు. కాసేపటి తరువాత రమేష్ ఫోన్ చేసి ఈ విషయమై అడగగా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని చెప్పడంతో దిలీప్ మోసపోయానని తెలుసుకున్నాడు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా డబ్బులు కోసం మెసేజ్ చేస్తే వారికి ముందుగా ఫోన్ చేసి కనుక్కున్న తరువాత డబ్బులు వేయాలని సూచిస్తున్నారు. అలాగే వాట్సాప్ లో తమ ఫోటోలు అందరికీ కనిపించకుండా ఉండేందుకు సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాలి అని అన్నారు. ఫోన్లో మాట్లాడితే ఇష్టపడతారని వాట్సాప్ లో చాటింగ్ ద్వారా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు అని తెలియజేశారు. ఇలాంటి నెంబర్లన్నీ +1 కోడ్ తో వస్తున్నాయి . దీంతో ఇతర దేశాల నెంబర్లని తీసుకొని వెంటనే డబ్బులు పంపిస్తున్నారు. అయితే ఈ ఎకౌంట్ నెంబర్ లన్ని ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలవి కావడం గమనార్హం.. అయితే ఇదంతా అమెరికా కేంద్రంగా జరగడం గమనార్హం. ఇకనైనా ఆఫర్  వచ్చిన ప్రతి లింక్ పై క్లిక్  చేయకుండా సూచిస్తున్నారు. అలాగే వాట్సాప్ ప్రొఫైల్ మీకు తెలిసిన వ్యక్తులు చూసే విధంగా సెట్టింగ్స్ మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?