టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Driverless Tractor : ఈ యువ రైతు ఐడియా అదిరింది గురూ.. ఫాలో అవ్వాల్సిందే..!!

Share

Driverless Tractor : సాధారణంగా ట్రాక్టర్ నడపడం చాలా కష్టం.. వెనకాల ట్రాలీ ఉంటే మరింత జాగ్రత్తగా ట్రాక్టర్ నడపాలి.. అటువంటిది అసలు డ్రైవర్ తో పని లేకుండా ట్రాక్టర్ దానంతటదే నడిస్తే ఇక రైతుకు అంతకంటే హాయి ఏముంటుంది.. పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నేటప్పుడు రైతులకు నడుము నొప్పి వస్తూ ఉంటుంది.. ఇది శతాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య.. ట్రాక్టర్ పై రైతు కూర్చొని డ్రైవ్ చేసే అవసరమే లేకుండా ట్రాక్టర్ దానంతట అదే రైతుకు ఎంతో మేలు.. ఈ కలను నిజం చేసి చూపిస్తున్నాడు రాజస్థాన్ కి చెందిన 19 ఏళ్ల యువ రైతు.. బారో సిటీ లో నివసిస్తున్న యోగేష్ డ్రైవర్ సాయంతో నడిచే ట్రాక్టర్ లో మార్పులు చేసి ఈ ఘనత సాధించాడు.

Driverless Tractor : manufactured by young farmer
Driverless Tractor : manufactured by young farmer

బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యోగేష్ కి ఒక రోజు ఫోన్ వచ్చింది. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. అర్జెంటుగా నువ్వు ఊరికి రా అన్నారు. హడావుడిగా ఊరెళ్ళాడు. తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ .. మరోవైపు పనులు పొలం పనులు చేయాల్సి వచ్చింది. సుమారు 2 నెలల పాటు ట్రాక్టర్ తో పని చేశాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది.. మనం ఇప్పటివరకు డ్రైవర్ లెస్ కార్లను చూస్తున్నాం అలాంటప్పుడు డ్రైవ్ ట్రాక్టర్ ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు అలా రిమోట్ కంట్రోల్ తో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశాడు.

దీని కోసం కేవలం రెండు వేల రూపాయలతో ప్రయోగం ప్రారంభించాడు యోగేష్.. అయితే తండ్రి ఎలా పనిచేస్తుందో తనకు వివరిస్తే.. అది తనకు నచ్చితే అందుకు కావాల్సిన డబ్బులు ఇస్తానని కొడుక్కి మాట ఇచ్చాడు. యోగేష్ రెండు వేల రూపాయలతో కొన్ని పరికరాలను కొనుగోలు చేసి రిమోట్ సహాయంతో ట్రాక్టర్ ను వెనుక నుండి ముందుకు నడిపించాడు. తండ్రికి ఆలోచనలపై నమ్మకం కలిగించాడు యోగేష్. అప్పుడు తండ్రి తన కొడుకు చెప్పిన విషయం పై నమ్మకం కలిగి రూ . 50,000 అప్పు చేసి మరీ ఇచ్చాడు. యోగేష్ డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ ను తయారు చేశాడు. ఈ ట్రాక్టర్ తో రైతులు ఎన్నో లాభాలు ఉంటాయి అంటున్నాడు. ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తుందని.. డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపారు. రిమోట్ కంట్రోల్ ట్రాక్టర్ ను చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

కోవిడ్ కి ఎంత ఖర్చో తెలుసా? గుండె పట్టుకుని ఈ న్యూస్ చదవండి!

somaraju sharma

Digested food: వీటిని  తీసుకుంటే  చాలు..  మనం తిన్న ఆహారం  త్వరగా జీర్ణం అయిపోతుంది!!

siddhu

karthika deepam: మళ్ళీ సౌర్యకు అన్యాయం…నిరూపమ్, హిమ ప్రేమించుకుంటే సౌర్య పరిస్థితి ఏంటి..?

Ram