టెక్నాలజీ

SemiconIndia 2022: సెమీ కండక్టర్ ల కొరత.. తీవ్ర ఇబ్బందుల్లో కార్ ల కంపెనీలు.. రంగంలోకి మోడీ..!!

Share

SemiconIndia 2022: ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ ల కొరత కారణంగా SUV కార్లు సకాలంలో భారతీయ వినియోగదారులు డెలివరీ చేయలేకపోతున్నారు. ఈ పరిణామంతో ఇండియాలో వినియోగదారులు కొనుగోలుదారుల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ చీప్ కొరత ఏర్పడింది. దానికి గల కారణాలు చూస్తే మొదటిది మహమ్మారి కరోనా ప్రధాన కారణమైతే రెండవది సెమీకండక్టర్ లు తయారుచేసే ప్రముఖ కంపెనీ ఇంటెల్ చేసిన పెద్ద తప్పిదం. అదేవిధంగా మెమరీ చిప్ ధరలు తగ్గిపోవడం.. ఇంకా పలు కారణాలు. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ ల కొరత ఏర్పడటంతో కార్ల తయారీ కంపెనీల వినియోగదారులు.. కొనుగోలుదారులకు ఆర్డర్ ఇచ్చిన సమయం కంటే చాలా ఆలస్యంగా డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

due to Semiconductor Shortage suffers Indian consumers

 

దీంతో తీవ్రస్థాయిలో కస్టమర్ల నుండి కంపెనీలు విమర్శలు ఎదుర్కొంటున్నయి. ఈ దెబ్బతో SUV కొరత కారణంగా ఇండియాలో ప్రముఖ కంపెనీలు మహేంద్ర అదేవిధంగా స్కోడా, కియా ఇంకా ప్రముఖ కంపెనీల వినియోగదారులు అనుకున్న సమయం కంటే కార్లను డెలివరీ చేయలేకపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే సెమీకండక్టర్ కొరతను అధిగమించడానికి.. ప్రధాని మోడీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. సేమికాన్ ఇండియా పేరిట బెంగళూరు లో సమావేశం నిర్వహించి ఇండియాలోనే సెమీ కండక్టర్ ల టెక్నాలజీ మరింత అభివృద్ధి అయ్యేలా పిలుపునివ్వడం జరిగింది.

due to Semiconductor Shortage suffers Indian consumers

దేశవ్యాప్తంగా ఉన్న 1.3 బిలియన్ ప్రజలను అనుసంధానం చేస్తూ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలని ఈ సమావేశంలో సూచించారు. ఇంకా అనేక విషయాలను తెలియజేస్తూ ఇండియాలో సెమీకండక్టర్ తయారీ విధానం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఏదిఏమైనా దేశంలో సెమీకండక్టర్ ల కొరత కారణంగా భారతీయ కార్ ల కంపెనీ  వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం మాత్రమే కాదు కంపెనీలు కూడా మూసుకునే పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్… తక్కువ ధరతో పాటు ఎక్కువ ఫీచర్లు

Teja

వివో నుంచి 5జి ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

Srikanth A

IPL 2020: ఐపీఎల్ చూడటమే కాదు.. జియో క్రికెట్ ఆడండి.. బహుమతులు గెలుచుకోండి..!

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar