Youtube : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ ను ఉపయోగిస్తు, అందులోని వీడియోలను చూస్తుంటారు. అయితే ఈ ప్రపంచంలో దాదాపు100 కోట్లకు పైగా యూట్యూబ్ ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు. కేవలం మనకు సంబంధించినటువంటి వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా మనము ప్రతినెల డబ్బులను సంపాదించుకోవచ్చు. అయితే ఈ విధంగా డబ్బును సంపాదించుకోవాలంటే కొన్ని నియమాలు వర్తిస్తాయి. ఆ నియమాలు ఏమిటి?యూట్యూబ్ ద్వారా డబ్బులు ఏవిధంగా సంపాదించుకోవాలి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం…
ముందుగా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించు కోవాలి అనుకునేవారు ముందుగా గూగుల్ సైన్ ఇన్ కావాలి. జిమెయిల్ అకౌంట్ ఐడినే మన గూగుల్, యూట్యూబ్ ఐడి గా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఆ ఐడి పేరుమీదుగానే యూట్యూబ్ ఛానల్ ని కూడా ఓపెన్ చేయాలి.
యూట్యూబ్ లో సైన్ ఇన్ అయిన తర్వాత రైట్ సైడ్ అప్లోడ్ అనే బటన్ ఉంటుంది.ఆ బటన్ పై క్లిక్ చేసి మీరు తీసుకున్న మొదటి వీడియోను మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు. ఈ వీడియో లో అప్లోడ్ చేసిన తర్వాత వీడియోకు టైటిల్ పెట్టాలి. వీడియో పూర్తిగా అప్లోడ్ అయిన తర్వాత పబ్లిష్ అనే బటన్ నొక్కితే మనం అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ లో పబ్లిష్ అవుతుంది.
యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిష్ చేసే వీడియోలు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినవి మాత్రమే ఉండాలి. ఆ వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్న వీడియోలు అయినా సరే ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించి ఉండాలి. వేరే వాళ్ల వీడియోలను అప్లోడ్ చేయకూడదు.
మనం అప్లోడ్ చేసిన వీడియోలను ఒకవేళ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ మేనేజర్ ఫోల్డర్ లో మనకు కనిపిస్తాయి. మనం అప్లోడ్ చేసిన ఈ వీడియోలకు యూట్యూబ్ మేనేజ్మెంట్ యాడ్స్ జతచేస్తుంది. వీటి ద్వారా వచ్చే డబ్బులు 60శాతం యూట్యూబ్ సమస్య మనకు చెల్లిస్తుంది. అయితే ఈ డబ్బులు మన అకౌంట్లో జమ కావాలంటే అందుకు రెండు షరతులు వర్తిస్తాయి 1) యూట్యూబ్ ఛానల్ చేసి ఏడాదిలోపు సొంతంగా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి.2) ఏడాదిలోపు మనం అప్లోడ్ చేసిన వీడియోలు దాదాపు 4 లక్షల వ్యూస్ ఏడాదిలోపు పూర్తి చేసుకుని ఉండాలి. ఈ రెండు కండిషన్ లను పూర్తి చేసుకున్నప్పుడే మీ యూట్యూబ్ ఛానల్ అలాగే కొనసాగుతుంది.
మనం యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేసిన వీడియోలకు వ్యూస్ ఎక్కువగా వచ్చినప్పుడు మనకు డబ్బులు రావడం జరుగుతుంది. గూగుల్ యాడ్స్ సైన్ అకౌంట్ లో మీ సంపాదన ఆరువేల రూపాయలు దాటగానే గూగుల్ అకౌంట్ లో మీరిచ్చిన సొంత అడ్రస్ కి గూగుల్ నుంచి ఆరు సంఖ్యగల కోడ్ వస్తుంది. ఆ కోడ్ ను మీరు గూగుల్ యాడ్ సైన్ అకౌంట్ లో ఎంటర్ చేయాలి.కోడ్ ఎంటర్ చేశాక… వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, నెంబర్, IFSC వంటి వివరాల్ని యాడ్ సెన్స్ అడుగుతుంది. వాటిని కూడా యాడ్ సెన్స్ అకౌంట్లో ఇవ్వాల్సి ఉంటుంది.బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చాక… మీ సంపాదన రూ.7 వేలకు పైగా అవ్వగానే సింగపూర్ లో ఉన్న గూగుల్ బ్రాంచ్ ద్వారా నేరుగా మన అకౌంట్లో డబ్బులు జమవుతాయి. ఈ విధంగా యూట్యూబ్ నుంచి మనం ప్రతి నెల డబ్బులు ఎంతో సులభంగా సంపాదించుకోవచ్చు.