Father’s Love: తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తుంటారు.. పిల్లలకు ఇష్టమైన బొమ్మల కొనిచ్చి వారి కళ్ళల్లో ఆనందం చూసి హ్యాపీ గా ఫీల్ అవుతారు.. కేరళ కు చెందిన ఓ వ్యక్తి తన పిల్లల కోసం మరో అడుగు ముందుకు వేశాడు.. తన క్రియేటివ్ తో తన పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా ఓ బుల్లి జీపు ను తయారు చేసి ఇచ్చాడు..

కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆరికోడ్ గ్రామంలో నివసించే షరీక్ తన పిల్లల కోసం ఒక చిన్న సాఫ్ట్ టాప్ మహేంద్ర జీపు ను తయారుచేశాడు. అతడు తయారు చేసిన జీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అచ్చం మహీంద్రా జీప్ లా ఉన్న ఈ జీప్ 1000 వాట్స్ మోటార్ తో పని చేస్తుందని షకీర్ తెలిపారు. ఇందులో మ్యాన్యువల్ గేర్ బాక్స్, పవర్ స్టీరింగ్, డిటాచెబుల్ సాఫ్ట్ టాప్, హెడ్ లైట్ వంటి ఫీచర్లను ఇందులో లో ఉన్నాయి.
ఈ జీప్ ను తయారుచేయడానికి షాకీర్ కు ఒక సంవత్సరం పట్టిందని వివరించాడు అయితే తాను ఈ జీపును ఆది సంవత్సరాల క్రితమే తయారు చేశానని తెలిపారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోందని అన్నాడు. ఈ జీప్ 60-70 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంది ఈ జీపు తయారు చేయడానికి రూ 1.5 లక్షలు ఖర్చు షకీర్ అయ్యిందని పేర్కొన్నారు.