యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ కి కూడా కష్టాలు తప్పలేదు. సోమవారం సాయంత్రం నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా గూగుల్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు అయోమయంలో ఉన్నారు. ఒక్కసారిగా గూగుల్ సేవలు అయినా యూట్యూబ్, జిమెయిల్ సేవలన్నీ నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో గూగుల్ సంస్థ లో ఏం జరుగుతుందో తెలియక ప్రపంచవ్యాప్తంగా గూగుల్ యూజర్లలో తీవ్ర కల్లోలం ఏర్పడింది.
సాధారణంగా కొన్ని దేశాలలో అప్పుడప్పుడు ఇలాంటి సర్వర్లు డౌన్ అవ్వడంతో సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా గూగుల్ సర్వర్లు పనిచేయకపోవడంతో కోట్లాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు హెల్త్ ట్రాకర్ డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. అసలు సర్వర్లు డౌన్ అయిన సమయంలో కూడా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో కొన్ని సర్వీసులు పనిచేసినట్టు యూజర్లు తెలిపారు. అయితే గూగుల్ సంస్థలో ఎదురైన ఈ సమస్యల గురించి గూగుల్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ యూజర్లు కొన్ని గంటల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గూగుల్ సంస్థ మాత్రం స్పందించక పోవడంతో గూగుల్ యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై యూట్యూబ్‌ను ఓపెన్ చేయడానికి కొంతమంది ప్రయత్నించగా సర్వర్ కనెక్ట్ కావడం లేదని యూజర్లకు మెసేజ్ వస్తుంది. అయితే సాంకేతిక నిపుణులు ఈ సమస్యను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. గూగుల్ సేవలు ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయని ప్రపంచవ్యాప్తంగా గూగుల్ యూజర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.