నేటి సమాజంలో ఆర్థిక చైతన్యం పెరిగింది. పూర్వకాలంలో వస్తూ మార్పిడి నుంచి మెుదలైన ఆర్థిక పరిణితి కరెన్సీ ,డిజిటల్ కరెన్సీ వరకు అభివృద్ది చెందింది. నేటి ఆధునిక సమాజంలో ఏటీఎంల వాడడకం చాలా ఎక్కువ. ఆన్లైన్ వేదికగా జరిగే ప్రతి లావాదేవీకి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులను వాడుతునే ఉన్నాం. అయితే మీరు మీ ఏటిఎమ్ కార్డు నిశితంగా గమనించారా? కార్డుపై పైనున్న చిత్రంలో ఉన్నటువంటి గుర్తును చూశారా? వైఫై సింబల్లాగే ఉన్న ఓ గుర్తును అర్ధం ఏంటి?
అయితే దీని వల్ల ప్రయోజనం ఏముంది? ఓ సారి చూద్దాం.
వైఫై సింబల్ ఉన్న కార్డును కాంటాక్ట్‌లెస్ ఫీచర్ ఉన్న కార్డుగా వ్యవహరిస్తారు. ఈ సింబల్ ఉన్న కార్డును షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్ల వద్ద చెల్లింపులు చేయడానికి స్వైప్ చేయాల్సిన పని ఉండదు. దీన్ని పాయింట్ ఆఫ్ సేల్ పరికరం (పీవోఎస్ మెషీన్) మీద ట్యాప్ చేసి లావాదేవీ పూర్తివుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) వ్యవస్థతో పనిచేసే ఈ కార్డు పనిచేస్తాయి. వీటిలో ఉండే చిప్ వద్ద మన ఖాతాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇది మన ఖాత సమాచారన్ని తెలియజేసి నగదు చెల్లింపు జరిగేలా చేస్తుంది.
‘కాంటాక్ట్‌లెస్ డివైజ్ లాంటి వ్యవస్ధ ఉన్న ప్రాంతాల్లో ఈ కార్డు ఉపయోగించి భద్రతపరమై చేల్లింపులు చేయవచ్చు. కార్డును ట్యాప్ చేయగానే చెల్లింపులకు జరిగిపోతాయి. కార్డును పాయింట్ ఆఫ్ సేల్ యంత్రం వద్ద రెండు అంగుళాల దూరంలో ఉంచి చేల్లింపు చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, ఫ్రాన్స్‌లలో వీటి వినియోగం అధికంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో కూడా ఈ కార్డుల వినియోగం పెరిగిపోయింది. సాధారణ కార్డుతోపోలిస్తే, స్వైప్ చేయకుండా వేగంగా లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సిన పని లేదు.