హువావే కంపెనీ భారత్‌లో రెండు కొత్త హానర్ వాచ్‌లను విడుదల చేసింది. హానర్ వాచ్ ఈఎస్, హానర్ వాచ్ జీఎస్ ప్రొ పేరిట ఆ రెండు వాచ్‌లు విడుదలయ్యాయి. హానర్ వాచ్ ఈఎస్ స్మార్ట్ వాచ్‌లో.. 1.64 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ 5.0 ద్వారా ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్, ఐఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
వాచ్ ఈఎస్ స్మార్ట్ వాచ్‌లో.. జీపీఎస్ ఫీచర్ ఉంది. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ద్వారా హార్ట్ రేట్‌ను నిరంతరం తెలుసుకోవచ్చు. హువావే ట్రూస్లీప్ ట్రాకింగ్, ట్రూ రిలాక్స్ స్ట్రెస్ ట్రాకింగ్, 96 రకాల వర్కవుట్ మోడ్స్, 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తదితర ఇతర ఫీచర్లు లభిస్తున్నాయి.
అలాగే వాచ్ జీఎస్ ప్రొ స్మార్ట్ వాచ్‌లో.. 1.39 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ 5.1 ద్వారా ఈ వాచ్ ను ఆండ్రాయిడ్, ఐఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. జీపీఎస్ లభిస్తుంది. 500 సాంగ్స్‌ను స్టోర్ చేసుకునేలా 4జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఈ వాచ్‌లోనూ ఉంది. హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్పీవో2 మానిటర్, స్టెప్ కౌంటర్, 100 రకాల ట్రెయినింగ్ మోడ్స్, మిలిటిరీ గ్రేడ్ నాణ్యత, మన్నిక, 25 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లను ఈ వాచ్‌లో అందిస్తున్నారు.
కాగా హానర్ వాచ్ ఈఎస్ ధర రూ.7499 ఉంగా దీన్ని అమెజాన్‌లో అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ సేల్‌లో విక్రయిస్తారు. అలాగే హానర్ వాచ్ జీఎస్ ప్రొ స్మార్ట్‌వాచ్ ధర రూ.17,999 ఉండగా, దీన్ని అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో విక్రయిస్తారు.