Hyundai Creta: భారతదేశంలో లో రెండవ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్..!! ఇటీవలే హ్యుందాయ్ భారత మార్కెట్లోకి క్రెటా ను విడుదల చేసింది.. ఎస్ యూవీ విభాగంలో బెస్ట్ సెల్లార్ గా నిలిచింది హ్యుందాయ్ క్రెటా.. ఈ ఎస్ యూవీ మంచి ప్రీమియం లుక్, అనేక అప్డేటెడ్ ఫీచర్ను కలిగి ఉంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా ను కస్టమైజ్ చేశారు..
హ్యుందాయ్ క్రెటా ఎస్ యూవీ బంపర్ దిగువున గ్లాస్ బ్లాక్ స్ప్లిటర్ జతచేశారు అంతేకాకుండా ఈ బంపర్ పై ఎల్ఈడి రిఫ్లెక్టర్ లైట్లు అమర్చారు. ఈ ఎస్ యూవీ లో ప్రధానమైన మార్పు ఫ్రంట్ గ్రిల్ ను మార్చడం. ఈ ఎస్ యూవీ లోని గ్రిల్ ను తొలగించి ఆడి ఆర్ఎస్ కార్ లో ఉన్నటువంటి గ్రిల్ తో అమర్చారు. దీంతో ఈ కార్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఆర్ఎస్ గ్రిల్ క్రెటా ఎస్ యూవీ స్పోర్టి లుక్ కాకుండా ప్రీమియం లుక్ ఇస్తోంది. ఈ గ్రిల్ ధర రూ.6000.
ఫీచర్స్..
హ్యుందాయ్ క్రెటా ఎస్ యూవీ లో వెంటనే వెంటెడ్ సీట్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్ రూఫ్ వంటివి ఉన్నాయి. వీటితోపాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో హై ఎండ్ మోడల్స్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కారు మంచి సేఫ్టీ ఫీచర్స్ ను కలిగి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?